Hero Nithin: జయం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్.తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సదా సరసన నటించిన నితిన్ మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ కొట్టడంతో ఈయనకు వరుస అవకాశాలు వచ్చాయి.ఇలా జయం సినిమాతో మంచి హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే మొదటి సారి తేజ దర్శకత్వంలో నటించిన నితిన్ కు దర్శకుడు తేజ నుంచి చేదు అనుభవాన్ని కూడా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. తేజ తన పని పట్ల ఎంత నిబద్ధతగా పనిచేస్తారో మనకు తెలిసిందే.తనకు కరెక్ట్ గా అనిపించే ఎక్స్ప్రెషన్స్ రాకపోయినా ఆ సన్నివేశం సరిగా రాకపోయినా ఏకంగా సెలబ్రిటీలపై ఈయన చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ క్రమంలోనే జయం సినిమా సమయంలో నితిన్ ఒక ఎక్స్ప్రెషన్స్ సరిగా పెట్టకపోవడంతో ఈయన ఎక్కువ టేకులు తీసుకున్నారట.ఇలా ఎక్కువ టేకులు తీసుకున్నప్పటికీ సరైన ఎక్స్ప్రెషన్ రాకపోవడంతో దద్దమ్మ ఇది చేయడం కూడా రాదా నీకు అంటూ అందరి ముందే తేజ తనని అవమానించారని తెలుస్తోంది. ఈ విధంగా నితిన్ ను అందరి ముందు తేజ అలా తిట్టడంతో అక్కడే ఉన్నటువంటి గోపీచంద్ సదా షాక్ అయ్యారట.
ఇలా తేజ నితిన్ తిట్టడంతో చివరికి ఈయన తన ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా ఇవ్వడంతో షాట్ ఓకే అయ్యిందని తెలిపారు. ఇకపోతే ఇప్పటికీ ఈ సినిమాని నితిన్ టీవీలో చూసినప్పటికీ ఆ సన్నివేశం రాగానే ఈయనకు దర్శకుడు తేజ తిట్టిన మాటలు గుర్తుకు వస్తాయని ఓ సందర్భంలో నితిన్ వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…