హీరో సాయి కిరణ్ అనగానే అందరికీ “అనగనగా ఆకాశం ఉంది..”అనే పాట గుర్తుకు వస్తుంది.ఈ పాట ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సాయికిరణ్ ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. నువ్వే కావాలి సినిమాలో నిజానికి హీరో తరుణ్ అయినప్పటికీ, అనగనగా ఆకాశం ఉంది అనే పాట ద్వారా సాయి కిరణ్ కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలో ఎన్నో మంచి సినిమాలు చేసినప్పటికీ ఆ విజయాన్ని ఎక్కువ రోజులు నిలుపుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే ఫ్లాప్ సినిమాలలో నటిస్తూ పూర్తిగా సినిమా అవకాశాలను కోల్పోయి ఇండస్ట్రీకి దూరమైన సాయి కిరణ్ ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
సాయికిరణ్ కు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తూ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సమయంలో ఓ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారనీ, ఆ హీరోయిన్ మాయలో పడి సినిమాలపై దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులపాటు నిలవలేకపోయాడని పెద్ద ఎత్తున వార్తలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి.
ఈ విధంగా సినిమా అవకాశాలు రాకపోవడంతో వెండి తెరకు దూరమై బుల్లితెరకు మాత్రమే పరిమితమయ్యారు. ప్రస్తుతం బుల్లితెరపై తాను నటిస్తున్న సీరియల్స్ తనకు ఎంతో సంతృప్తినిస్తున్నాయని కిరణ్ తెలియజేశారు. ప్రస్తుతం మనసిచ్చి చూడు, గుప్పెడంత మనసు సీరియల్స్ ద్వారా ఎంతోమంది గుర్తింపును సంపాదించుకున్నారు సాయికిరణ్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…