సినిమా ఇండస్ట్రీలోకి టి.రాజేందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ సాగరం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా నళిని పరిచయమయ్యారు. ఈ సినిమా విజయవంతం కావడంతో చిరంజీవితో కలిసి సంఘర్షణ, ఇంటి గుట్టు అనే సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకున్నారు.ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈమె హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు.
నళిని హీరోయిన్ గా మంచి స్థాయిలో ఉన్న సమయంలో తమిళ స్టార్ నటుడు అయిన రామరాజన్ ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ పిల్లల బాధ్యతలు తీసుకున్నారు. ఈమెకు ఒక కొడుకు అరుణ్, కూతురు అరుణ ఉన్నారు. ఈ విధంగా కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నఈమె తిరిగి మరి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా పలు టీవీ షోలు టీవీ సీరియల్స్ ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను సందడి చేసిన ఈమె తన వైవాహిక జీవితంలో కొన్ని రోజుల పాటు సంతోషంగా గడిపిన తిరిగి తన భర్తతో విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. తన భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పటికే పిల్లలు తరచూ తన తండ్రి దగ్గరికి వెళ్లి వచ్చే వారని తెలిపారు.
ఈ క్రమంలోనే నళిని కూతురు ఓ సందర్భంలో మాట్లాడు తన తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే కూతురు అరుణ మాట్లాడుతూ వీరిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ ఒకరిపై ఒకరు ఎంతో గౌరవంగా ఉండే వారని ఎప్పుడూ కూడా ఒకరి గురించి ఒకరు చెడుగా చెప్పుకునే వారు కాదని తెలిపింది. ఈ క్రమంలోనే కోర్టులో న్యాయమూర్తి వీరికి విడాకులు మంజూరు చేసినట్లు తీర్పు వెల్లడించడంతో అమ్మ కళ్ళు తిరిగి పడిపోతే వెంటనే నాన్న వచ్చి పట్టుకున్నారని, ఈ విధంగా వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి న్యాయమూర్తి ఆశ్చర్యపోతూ ఇంత ప్రేమ ఉన్న వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు అంటూ సందేహం వ్యక్తం చేశారని తన తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ గురించి తెలియజేశారు.
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…