Movie News

కె. ఆర్.విజయ తన పెళ్లి రహస్యాన్ని బయటకు చెప్పక పోవడానికి కారణం ఏంటో తెలుసా?

కె. ఆర్ విజయ ఒకప్పడు ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో విజయ ఒకరు. ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. విజయ అసలు పేరు దైవనాయనకి ఈమె తండ్రి పేరు రామచంద్ర ఈయన తెలుగువాడే, అలాగే తన తల్లి కల్యాణి కేరళకు చెందిన అమ్మాయి.

విజయకు చిన్నప్పటి నుంచే నాటకాల అంటే ఎంతో ఇష్టం ఉండడం చేత ఎన్నో కార్యక్రమాలలో నాటకాలు వేస్తూ చెన్నై చేరుకున్నారు. ఈ విధంగా నటనపై ఎంతో ఆసక్తి ఉన్నటువంటి విజయ మొట్టమొదటిసారిగా ఎస్ గోపాల కృష్ణన్ దర్శకత్వంలో 1963 తమిళంలో “కర్పగమ్”అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో నటించే సమయంలోనే ఈమె పేరును దైవనాయకి కి బదులుగా తన తల్లి తండ్రి పేరు కలిసే విధంగా కె.ఆర్.విజయ అని పెట్టుకున్నారు.

ఈ విధంగా తమిళంలోకి అడుగు పెట్టిన ఈమె 1966 ఎన్టీఆర్ సరసన శ్రీకృష్ణ పాండవీయం సినిమాల్లో నటించారు.ఈ సినిమాలో నటించే సమయానికి ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. అదే ఏడాదలోనే విజయ తమిళ నిర్మాత, ఫైనాన్షియర్ సుదర్శన్ వేలాయుధమ్ సినిమాలో విజయ నటించారు. ఈ సినిమా కారణంగా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

వీరిద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ ఆ తర్వాత క్రమంగా బలపడుతూ పెళ్లి వరకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న విషయాన్ని కూడా బయట పెట్టలేదు. అందుకు గల కారణం ఏమిటంటే.. ఈమె ఆ నిర్మాతను పెళ్లి చేసుకున్న సమయానికి ఈమె ఇంకా మైనర్ కావడంతో తన పెళ్లి విషయం గురించి ఎక్కడా చెప్పలేదు.

ఈ క్రమంలోనే విజయ గర్భిణిగా ఉన్నప్పుడు వేలాయుధమ్ తనను పర్యటన కోసమని ఫ్లైట్లో తీసుకు వెళ్ళాడు. అప్పటికే అతనికి ఒక సొంత జట్ ఫ్లైట్ ఉండేది. ఈ విధంగా పర్యటనకు వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి వీరి ఫోటోలను తీయడంతో ఆ ఫోటోలు మరుసటి రోజు ప్రతి ఒక్క పత్రికలో ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలోనే విజయ వివాహం చేసుకుందనే విషయం బయటపడింది.పెళ్లి తర్వాత కూడా తన భర్త ప్రోత్సాహం వల్ల ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెరుగులో ఉప్పు మంచిదా? చక్కెర మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!

భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…

2 hours ago

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాలకు వెళ్లితే పసిడి కథే వేరు..

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…

2 hours ago

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…

2 hours ago

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

10 hours ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

1 day ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

1 day ago