షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను అక్టోబర్ మూడవ తేదీన క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడుతూ ఎన్సీబీ అధికారులకు పట్టుబడిన సంగతి మనకు తెలిసిందే. అప్పటి నుంచి ఎన్సీబీ అధికారుల కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్ ను అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్యన్ ను నిన్న కోర్టులో హాజరు పరచగా అతనికి బెయిల్ రాకపోవడంతో షారుక్ ఖాన్ కుటుంబం ఎంతో నిరాశ చెందారు.
ఈ క్రమంలోనే ఆర్యన్ కి బెయిల్ రాకపోవడంతో షారుక్ ఖాన్ ఆర్థర్ జైల్ లో ఉన్న తన కొడుకును చూడటానికి అక్కడికి వెళ్లారు. షారుక్ ఆర్థర్ జైల్ కి వెళ్లి ఆర్యన్ తో సుమారు 20 నిమిషాల వరకు మాట్లాడినట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన విచారణలో భాగంగా ఆర్యన్ ఖాన్ కి బెయిల్ రాకపోవడంతో ఎంతో విచారం వ్యక్తం చేశారు.ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయినప్పటినుంచి ఆర్యన్ ఖాన్ అరెస్టు విషయంలో రాజకీయ కుట్ర జరుగుతోంది అంటూ పలువురు ఆరోపించారు.
వీరి రాజకీయ లబ్దికోసం అభం శుభం తెలియని ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ఓ కుర్రాడు జీవితాన్ని బలి చేస్తున్నారంటూ ఆర్యన్ ఖాన్ కి చాలామంది మద్దతుగా నిలిచారు. అయితే నిన్న విచారణలో భాగంగా ఆర్యన్ ఫోన్ లో బాలీవుడ్ హీరోయిన్ తో ఆర్యన్ ఖాన్ డ్రెస్ గురించి చాటింగ్ చేసినట్లు అధికారులు కోర్టుకు సమర్పించడంతో ఆ విషయం గురించి మరింత విచారణ చేపట్టడానికి సమయం కావాలని కోరడంతో మరోసారి అతని బెయిలును రద్దు చేసినట్టు తెలుస్తోంది.
ఇలా సుమారు 20 రోజుల నుంచి ఆర్యన్ ఖాన్ జైలులో ఉండడంతో షారుక్ ఖాన్ నటిస్తున్నటువంటి సినిమాలను పక్కన పెట్టి తన కొడుకును బయటకు తీసుకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. షారుక్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆర్యన్ బయటకు రాకపోవడం అతనిని ఎంతో కృంగదీసిందని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…