ఒకప్పుడు హీరోగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటుడు సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇండస్ట్రీలో సరైన హిట్ లేక అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన సిద్ధార్థ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ సినిమా విషయాలనే కాకుండా సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ చేసిన ట్వీట్లు పలు వివాదాలకు కారణమయ్యాయి.
ఈ క్రమంలోనే కొందరు సిద్ధార్థను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సైతం అతనికి రక్షణ కల్పించారు. తాజాగా సిద్ధార్థ్ మరో వివాదం ద్వారా వార్తల్లో నిలిచారు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన నారప్పా చిత్రం నుంచి “ఓ… నారప్ప”అనే పాటను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో లో వెంకటేష్ కి జోడీగా అమ్ము అభిరామి నటించింది. దీంతో వయస్సుని ప్రధానాంశంగా తీసుకుని నెటిజన్లు పెద్దఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మాత్రం ఈ వ్యవహారంలోకి హీరో సిద్ధార్థను లాగాడు. 40 సంవత్సరాలు పైబడిన సిద్ధార్థతో 20 ఏళ్ల హీరోయిన్ నటిస్తే వల్లమాలిన ప్రేమలు, ముద్దుల ఎమోజీలు.. ఇదెక్కడి లాజిక్కో.. అంటూ ట్వీట్ చేస్తూ ఏకంగా హీరో సిద్ధార్థకు ట్యాగ్ చేశాడు. దీంతో స్పందించిన సిద్ధార్థ్ సదరు నెటిజెన్ కి భారీ కౌంటర్ ఇచ్చారు.”ఈ హీరోల వయసు టాపిక్ లో ఫస్ట్ నేనే గుర్తొచ్చాను రా? ట్యాగ్ కూడా చేశావ్? సూపర్ రా దరిద్రమ్. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?” అంటూ ట్వీట్ చేశారు.
ఈ క్రమంలోనే మరొకని నెటిజన్ మీరు ప్రకాష్ రాజ్ క్లాస్మేట్స్ అంటగా అంటూ కామెంట్ చేయగా.. దీనిపై స్పందించిన సిద్ధార్థ్ ప్రకాష్ నా దత్తపుత్రుడు… మోహన్ బాబు నా క్లాస్మేట్ ముందు నిజాలు తెలుసుకో’ అంటూ సిద్ధార్త్ పేర్కొన్నాడు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…