బుల్లితెరపై టాప్ రేటింగ్స్ లో దూసుకుపోతున్న సీరియల్ ఏదైనా ఉందా అంటే అది కార్తీకదీపం సీరియల్ అని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో కార్తీకదీపం సీరియల్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. బుల్లితెరపై ప్రసారమయ్యే ఏ కార్యక్రమం, ఏ రియాలిటీ షోలు అయినా కానీ కార్తీకదీపం దెబ్బకు డీలా పడాల్సిందే. అంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ గురించి పొగిడేవారు ఉన్నారు.. తిట్టుకునే వారు ఉన్నారు.
ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ గురించి చెప్పాలంటే ఈ సీరియల్ లో ఒక్కొక్కరి పాత్ర విభిన్న రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఒక పాత్ర చాలా బోర్ కొడుతుందన్న నేపథ్యంలో ఆ పాత్రపై ఇంట్రెస్టింగ్ కథను తీసుకువస్తారు.ఈ విధంగా ఈ సీరియల్ టాప్ వన్ రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుంది. అదేవిధంగా మరికొందరు ఈ సీరియల్ గురించి మాట్లాడుతూ కార్తీకదీపం డైరెక్టర్ ఒక పాయింట్ ని పట్టుకుని దానిని సాగదీస్తూ ప్రజలను సావకొడుతున్నారు అంటూ చెబుతుంటారు.
తాజాగా కార్తీకదీపం సీరియల్ డాక్టర్ బాబు అలియాస్ పరిటాల నిరుపమ్ మాట్లాడుతూ… కార్తీకదీపం సీరియల్ ఇంత పెద్ద సక్సెస్ అయ్యిందంటే అందుకు కారణం డైరెక్టర్ కాపు గంటి రాజేంద్ర గారని తెలిపారు. ఆయన కాకుండా వేరే డైరెక్టర్ అయి ఉంటే ఈ సీరియల్ ఇంత విజయం సాధించేది కాదు. ఆయనకు ఎప్పుడు ఏ పాయింట్ ప్రేక్షకులకు చూపించాలో అలానే చూపిస్తారు.
మీరు సీరియల్ చూస్తున్నారు కదా అని మేము సాగదీసి పిచ్చిపిచ్చిగా సీరియల్ తీయడం అనేది జరగదు. మాకు ఈ కథపై చాలా నమ్మకం ఉంది. ఈ పాయింట్ స్ట్రాంగ్గా ఉందనిపిస్తే మేము ఆ పాయింట్ పై ప్రో లాంగ్ అవుతామని.. ఇప్పటి వరకు అదే జరిగింది. ఇకపై ఈ సీరియల్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చాలానే ఉంటాయి అంటూ ఈ సీరియల్ గురించి డాక్టర్ బాబు క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…