Movie News

22 ఏళ్ల సినీ కెరీర్ ఉన్న హీరో.. అయినా ఒక్క సొంత ఇల్లు లేదు!.. కారణం వింటే షాక్ అవుతారు!

సినిమా పరిశ్రమలోకి వచ్చి ఒక్కసారి ఫేమ్ వస్తే చాలంటారు… అప్పుడే భవిష్యత్‌ కోసం ప్లానింగ్ మొదలవుతుంది. ఆస్తులు కొనడం, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చాలా సాధారణం. కానీ కొందరు మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. అలాంటి వారిలో తమిళ్, తెలుగు భాషల్లో తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సిద్దార్థ్ ఒకరు.

A hero with a 22-year film career.. yet he doesn’t have a single house of his own!..

ఇప్పటివరకు 25 ఏళ్లకుపైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా అతను సొంతంగా ఒక ఇల్లు కూడా కొనుక్కోలేదు. ఇది ఆయన అభిమానులకే కాకుండా, మీడియా వర్గాలకూ నిజంగా ఆశ్చర్యమే. తాజాగా ‘3BHK’ అనే సినిమా ప్రమోషన్స్ సందర్భంగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో సిద్దార్థ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

“నేను ఇండస్ట్రీకి వచ్చి సుమారు 25 ఏళ్లు అయింది. నా జీవితం సగం సినిమాల్లోనే గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకూ నేను ఒక్క ప్రాపర్టీ కూడా కొనలేదు. నాకు ఇంటి అవసరం అనిపించలేదు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, బాధ్యతలు పెరిగాయి. అందుకే ఇటీవలే ఓ సొంత ఇల్లు కొనుకున్నాం. ఇది నేను, అదితి ఇద్దరం కలిసే కలగన్న డ్రీం హౌస్” అని తెలిపారు.

అయితే ఆయన వ్యాఖ్యలపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సిద్దార్థ్ ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, రంగ్‌దే బసంతి లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు. అలాంటిది ఇప్పటివరకు సొంత ఇల్లు లేకుండా ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అలాగే ఇటీవలే హీరోయిన్ అదితి రావు హైదరీతో వివాహం చేసుకున్న సిద్దార్థ్, ఇప్పుడు వారి జీవితంలో మరో ముఖ్యమైన మైలు రాయిని చేర్చుకున్నట్లు చెప్పొచ్చు. “నా పెరెంట్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు.. సిద్దూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, ఎప్పుడు ఇంటి తాళాలు తిరుగుతాయా అని. ఇప్పుడు వాళ్ల కోరిక తీరినట్టే” అని సంతోషంగా తెలిపారు.

3BHK సినిమా కథ కూడా ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తమ సొంతింటి కలను ఎలా నెరవేర్చుకుంటుందనే కథాంశంతో సాగుతుంది. ఇదే నేపథ్యంలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన సిద్దార్థ్ మాటలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటున్నాయి.

సినిమాల్లో స్టార్ అయినా కూడా ఆస్తులపై ఆశ లేకుండా జీవించిన సిద్దార్థ్‌ నిరాడంబరతకు ఇది నిదర్శనం. ఇప్పుడు కుటుంబ బాధ్యతలతో పాటు ఒక భవిష్యత్‌ ఆలోచనగా సొంత ఇల్లు కొన్న ఆయన నిర్ణయం అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago