Movie News

Komali Prasad : డాక్టర్‌గా మళ్లీ తన అసలైన ప్రయాణాన్ని ప్రారంభించిన టాలీవుడ్ నటి!

Komali Prasad : టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నటి కోమలి ప్రసాద్ ప్రస్తుతం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి ఆమె చేసిన పని సినిమా కంటే కూడా ప్రత్యేకం. డాక్టర్‌గా మళ్లీ ప్రాక్టీస్ చేయడానికి ఆమె సిద్ధమవుతోంది. ఓ వైపు సినీ రంగంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆమె, మరోవైపు డాక్టర్‌గా మళ్లీ తన వృత్తిని కొనసాగించాలనే నిర్ణయం తీసుకోవడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచే విషయమే.

Tollywood actress komali prasad who has resumed her original journey as a doctor!

విశాఖపట్నంలో పుట్టి పెరిగిన కోమలి ప్రసాద్ చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబర్చింది. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమె చదువులపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. అదే సమయంలో, క్రీడా రంగంలోనూ ఆమె మంచి ప్రతిభ కనబర్చింది. కోకో, బ్యాడ్మింటన్ వంటి ఆటలలో ఆమె బంగారు పతకాలు గెలిచింది. అంతేకాకుండా, ఆమె ఒక మంచి క్లాసికల్ డాన్సర్ కూడా. విద్యలో, క్రీడల్లో, నృత్యంలో ఒకేసారి ప్రతిభ కనబర్చిన కోమలి, అనంతరం అహ్మద్‌నగర్‌లోని ప్రవర మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో మెడిసిన్ పూర్తిచేసింది.

మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత, అమెరికాలో మాస్టర్స్ చేయాలనే లక్ష్యంతో న్యూయార్క్ వెళ్లాలనే ఆలోచనలో ఉన్న సమయంలో, ఆమెకు అనుకోకుండా సినిమాల్లో అవకాశం వచ్చింది. మొదట తలంపులో లేని అవకాశం వచ్చినా, ఆ ఛాన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చి, ఆమె మాస్టర్స్ అప్లికేషన్‌ను చింపేసేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

2016లో ‘సీతాదేవి’ సినిమాతో ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం నెపోలియన్, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ PC 524, హిట్-2, హిట్-3 వంటి సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇటీవలి హిట్ చిత్రం హిట్-3లో నాని సరసన ‘ఎస్పీ వర్షా’ పాత్రలో కనిపించి తన పాత్రకు ప్రాధాన్యతను చాటుకుంది.

ఇంతవరకు సినిమాల్లో బిజీగా ఉన్న కోమలి ప్రసాద్, ఇప్పుడు మరోసారి డాక్టర్‌గా తన రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వైట్ కోట్ ధరించిన ఫోటోలు షేర్ చేస్తూ, “స్వచ్ఛమైన నవ్వుల కోసం సిద్ధంగా ఉండండి.. త్వరలోనే డాక్టర్ కోమలి ప్రసాద్ రాబోతోంది” అని పేర్కొంది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది చూసిన అభిమానులు ఆమె నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. కొన్ని టీవీ షోలు, సోషల్ మీడియా ద్వారా మాత్రం ఆమె అభిమానులతో టచ్‌లో ఉండే అవకాశముంది. ఆమె నటనను మిస్ అవుతామన్న వేదన కొంతమందిలో ఉన్నా, సేవా దృక్పథంతో చేసిన ఈ నిర్ణయం హృదయాన్ని తాకుతోంది.

కోమలి ప్రసాద్‌ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. చదువు, క్రీడలు, నాట్యం, సినిమాలు అన్నీ అద్భుతంగా సమతౌల్యంలో ఉంచి ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఆమె వైద్య సేవల్లో మునిగి తెలుగునాట మరో రోల్ మోడల్‌గా నిలవనుంది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

17 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago