Tamil Nadu Police register a criminal case on AP Deputy CM Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మరోసారి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. తమిళనాడులోని చెన్నై, అన్నానగర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు అయింది. ఈ కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద దుమారాన్ని రేపే అవకాశముంది.
జూన్ 22న తమిళనాడులోని మధురై జిల్లా మురుగన్ భక్తుల సదస్సు (Murugan Devotees Conference) లో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్‌తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై కూడా హాజరయ్యారు. అయితే, ఈ సభ ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహించారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అభియోగాల ప్రకారం, సభ నిర్వహణలో సార్వజనిక నిబంధనలు ఉల్లంఘించారని, పబ్లిక్ ఆర్డర్‌కు హాని కలిగించేలా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే పోలీసులు చర్యలు తీసుకున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం, అధికార స్థానం దృష్ట్యా ఈ కేసు తీవ్ర రాజకీయ చర్చనీయాంశంగా మారింది.
ఇకపై పవన్‌కల్యాణ్, అన్నామలై ఇలా రాజకీయంగా కలసి పని చేయడంపై తమిళనాడు అధికార వర్గాలు మరింత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశముంది. మరోవైపు పవన్ అభిమానులు మాత్రం ఇది కావాలని చేసిన రాజకీయ కుట్రగా అభిప్రాయపడుతున్నారు.
పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…