Movie News

Serial Artist Sagar : బంగారం లాంటి సీరియల్ కెరీర్‌ను వదిలి సినిమాల్లోకి.. సాగర్ ఫెయిల్యూర్‌కు కారణం తానేనా?

సీరియల్స్‌ను చాలామంది లైట్‌గా తీసుకుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో సీరియల్ నటులకు వచ్చే ఫాలోయింగ్ కొంతమంది సినీ తారలకు కూడా ఉండదు. అలాంటి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న వ్యక్తి సాగర్. ‘ఆర్కే నాయుడు’ అనే క్యారెక్టర్‌ పేరు చెప్పగానే తెలియని సీరియల్ ప్రేమికుడు ఉండడంటే ఆశ్చర్యమే. ‘మొగలి రేకులు’ సీరియల్‌లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సాగర్‌కు అప్పట్లోనే కాదు, ఇప్పటికీ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ, సినిమాల్లో కెరీర్ మొదలుపెట్టి, సీరియల్స్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన ఇప్పుడు రెండింటిలోనూ కనిపించడం లేదు.

Leaving his serial career to enter films.. Is Sagar the reason for his failure?

సాగర్ అసలు పేరు సాగర్ మరుగుంట్ల. 1978లో తెలంగాణలోని గోదావరిఖనీలో జన్మించారు. తండ్రి సింగరేణిలో ఉద్యోగి కాగా, తల్లి గృహిణి. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించేవాడు. ‘మనసంతా నువ్వే’ వంటి సినిమాల్లో చిన్న పాత్రలతో ప్రయాణం మొదలుపెట్టాడు. తర్వాత సలహాలతో సీరియల్స్ ట్రై చేయగా, ‘అమృతం’లో చిన్న రోల్ చేశాడు. శ్రీకాంత్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆఫీస్ చుట్టూ తిరిగే రోజుల్లో, చక్రవాకం షూటింగ్ సమయంలో ఇంద్ర నీల్‌ను కలవడం, మంజుల నాయుడు సోదరి బిందు నాయుతో పరిచయం కావడం… ఇలా ఒక మలుపు తిప్పింది. చక్రవాకంలో చిన్న పాత్రలో ప్రవేశించిన సాగర్ ఆఖరికి మెయిన్ లీడ్‌గా మారాడు.

అక్కడినుంచి మంజుల నాయుడు తీసిన ‘మొగలి రేకులు’లో ఆర్కే నాయుడు పాత్రతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసాడు. అదే సమయంలో వచ్చిన ప్రభాస్ మూవీ ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో చిన్న పాత్ర నచ్చక సాగర్ రిజెక్ట్ చేసాడు. కానీ దర్శకుడు దశరథ్ ఒప్పించగా, డైరెక్టర్ దగ్గర మార్కులు కొట్టేయాలని అప్పుడు అసిస్టెంట్ గా ఉన్న బాబీ అలియాస్ కే ఎస్ రవీంద్ర, సాగర్ ను సినిమాలో నీ క్యారెక్టర్ ప్రభాస్ కంటే ఇంపార్టెంట్ అంటూ చెప్పి ఒప్పించాడు. అయితే సినిమా విడుదల అయ్యాక సాగర్ క్యారెక్టర్ చాలా సింపుల్ గా ఉండటంతో ఆయన ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. సినిమాల్లో తనకు కెరీర్ లేకుండా చేసింది బాబీ నే అని సాగర్ ఒక ఇంటర్వ్యూ లో కూడా జరిగిన విషయాన్ని చెప్పారు.

ఆ సినిమా తర్వాత ఆయన మరొక సినిమాలో కనిపించలేదు. ‘మొగలి రేకులు’ పూర్తయ్యాక మరో సీరియల్ ఒప్పుకోకుండా, సినిమాల్లోనే సెటిల్ అవ్వాలనే లక్ష్యంతో దాదాపు 30 సీరియల్స్‌ను తిరస్కరించాడు.

హీరోగా ‘సిద్ధార్థ’, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘షాదీ ముబారక్’ సినిమాలు చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అయినా, సాగర్‌కు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి గారు, చిరంజీవి భార్య సురేఖ గారు అభిమానులే కావడం విశేషం. ఒకసారి నాగబాబు ద్వారా ఇంటికి పిలిపించి, మాట్లాడినట్టు తెలుస్తోంది. అంజనా దేవి గారి చేతుల మీదుగా సాగర్ సినిమాకు ట్రైలర్ కూడా లాంచ్ చేశారు.

ప్రస్తుతం ‘ది 100’ అనే సినిమాలో హీరోగా, ‘కోరమీను ఆంధ్ర కింగ్’లో సెకండ్ హీరోగా నటిస్తున్నాడు. ఫ్యామిలీ విషయానికి వస్తే, భార్య సౌందర్యతో కలిసి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమాల మీద ఫోకస్ చేస్తూనే, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారాల్లో స్థిరపడిన సాగర్, ఇప్పటికీ సినిమాల్లో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాడు సాగర్.. ఏది ఏమైనా బుల్లితెర మీద అయన అభిమానులు మిస్ అవుతోంది మాత్రం వాస్తవం.

telugudesk

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

11 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

12 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

19 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

20 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

20 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago