Fish Venkat's health condition is critical.. Treatment on ventilator
టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాల్లో హాస్య పాత్రలతో ప్రేక్షకులను నవ్వించిన ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా మారింది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
అనేక రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలు వేధిస్తున్న ఆయన, గతంలో డయాలసిస్ తీసుకున్నారు. కొంతకాలం బాగానే ఉన్న ఫిష్ వెంకట్, ఇటీవల ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి తీవ్రంగా క్షీణించినట్లు వైద్యులు వెల్లడించారు. శరీరంలో విషపదార్థాలు పెరిగిపోవడం, మూత్ర విసర్జన తక్కువవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాల నేపథ్యంలో వెంటిలేటర్‌పై ఉంచినట్లు సమాచారం.
అయితే పరిస్థితి సీరియస్ గా ఉండటంతో అతని భార్య, కుటుంబ సభ్యులు ఆదుకునే మనుషుల కోసం ఎదురు చూస్తున్నారు. సినీ పరిశ్రమలో ఆయనకు ఉన్న మిత్రులు, సహనటులు స్పందించాలని వారు వేడుకుంటున్నారు. సినీ వర్గాల నుంచి ఇప్పటివరకు స్పందన ఏమిటీ అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఫిష్ వెంకట్ అనేక తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పాత్రలే అయినా తన కామెడీ టైమింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న వెంకట్‌కి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషయంలో అనేక మంది అభిమానులు సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు. సినీ ప్రముఖులు స్పందించి ఆర్థిక, నైతికంగా కుటుంబానికి అండగా నిలవాలని కోరుకుంటున్నారు. పరిస్థితి మరింత విషమించకముందే పూర్తి స్థాయి వైద్యం అందించడం అవసరం. మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…