Featured

Hero Sumanth Ashwin : నిహారిక కోసం చెన్నై నుండి కేక్ తెప్పించా…: హీరో సుమంత్ అశ్విన్

Hero Sumanth Ashwin : సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ అనగానే వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్ధంటానా వంటి వరుస హిట్ సినిమాలు అందరికీ గుర్తొస్తాయి. కేవలం నిర్మాత అంటే సినిమాలకు డబ్బు ఇవ్వడం కాదు, నిర్మాతగా సినిమా తీయాలనే అభిరుచి ఉంటే అతనే కథ తయారుచేసుకుని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఎమ్ఎస్ రాజు గారు చూపించారు. ఇక ఆయన నిర్మాణ సంస్థ నుండి సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా సినిమా సూపర్ అనేంతలా ఆయన బ్రాండును క్రియేట్ చేసుకున్నారు. ఇక ఆయన కొడుకుగా సినిమాల్లోకి అడుగుపెట్టిన సుమంత్ అశ్విన్ తునీగా తునీగా, కేరింత అంటూ కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా ఇంకా రాణించలేదు. ఎంతో మంది హీరోలను సుపర్ స్టార్లను చేసిన ఎమ్ఎస్ రాజు గారు ఆయన కొడుకును హీరోగా నిలబెట్టడానిక ఇటీవల సినిమా ఆయనే డైరెక్షన్ చేసినా పెద్దగా ఆడలేదు.

నిహారిక కోసం కేక్ తెప్పించా…

సుమంత్ అశ్విన్ వరుసగా సినిమాలను చేస్తున్నా పెద్దగా హిట్స్ మాత్రం లేవు. తునీగా తునీగా పర్వాలేదనిపించింది. ఆ తరువాత చెప్పుకోదగ్గ సినిమాలంటే కేరింత, అంతకు ముందు ఆ తరువాత వంటి సినిమాలను చెప్పొచ్చు. ఇక రీ మేక్ గా వచ్చిన హ్యాపీ వెడ్డింగ్ సినిమా మంచి తారాగణం అలాగే పెద్ధ బ్యానర్ నిర్మించిన సినిమా అయినా సినిమా మాత్రం హిట్ కాలేదు. ఆ సినిమాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా చేసింది.

ఇక ఆ సినిమా సమయంలో నిహారిక తో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతూ తను చాలా ఫ్రెండ్లీ గా అందరితో ఉంటుంది. సెట్స్ లో తాను ఉంటే అందరూ యాక్టీవ్ గా ఉంటారు అంటూ చాలా సింపుల్ గా ఏ మాత్రం ఇగో లేకుండా ఉంటుంది అంటూ చెప్పాడు. ఇక తన తండ్రి నాగబాబు గారితో తునీగా తునీగా సినిమాలో కలిసి నటించినపుడు పరిచయం ఉందని, ఆయన బాగా మాట్లాడుతారు అలాగే నటనలో మంచి సలహాలు ఇస్తారంటూ చెప్పారు సుమంత్ అశ్విన్. అలా షూటింగ్ లో ఉన్నపుడు తన పుట్టినరోజు అని తెలిసి తన కజిన్ చెన్నై నుండి వస్తుంటే కేక్ తెప్పించి సర్ప్రైస్ చేశారట. తాను సెట్స్ లో ఉంటే అందరినీ నవ్విస్తూ ఉంటుంది అంటూ నిహారిక గురించి చెప్పాడు.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

1 day ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

1 day ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

1 day ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

1 day ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

1 day ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

1 day ago