Categories: FeaturedMovie News

అభిమాని పెళ్లిలో సందడి చేసిన హీరో సూర్య..!

ఒక సినిమాను తెరకెక్కించాలంటే ఎంతోమంది ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.ఆ విధంగా ఎంతో కష్టంతో తెరకెక్కించిన సినిమా విజయవంతం అయినప్పుడే కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది.ఆ విధంగా ఎంతో కష్టపడి తీసిన సినిమాలు ప్రేక్షకులు ఆదరించినప్పుడు ఆ హీరోలకు కూడా పేరు ప్రఖ్యాతలను సంపాదించింది పెడుతుంది. అలాంటి హీరోలను అభిమానించే అభిమానుల పట్ల హీరోలు కూడా ఎక్కువ ప్రేమాభిమానాలు చూపిస్తుంటారు.ఈ విధంగా తన అభిమానుల పై ప్రేమను చూపించే వారిలో తమిళ స్టార్ సూర్య ముందువరుసలో ఉంటారని చెప్పవచ్చు. అందుకు నిదర్శనమే ఇది. ఎంతో బిజీ షెడ్యూల్లో గడుపుతున్న సూర్య తన అభిమాని పెళ్లి అని తెలుసుకొని ఆ పెళ్లి మండపానికి చేరుకుని ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచారు..

సూర్య వీర అభిమాని ఆలిండియా సూర్య ఫ్యాన్ క్లబ్ సభ్యుడైన హరికి పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న హీరో సూర్య వధువు మెడలో తాళి కట్టే సమయానికి మండపానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన చేతుల మీదుగా తాళిని వరుడికి అందించి దగ్గరుండి పెళ్ళి తంతు కార్యక్రమాన్ని జరిపించాడు. మీ కొత్త జీవితం ఎంతో సుఖంగా జరగాలని ఆ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఒక్కసారిగా తన అభిమాన హీరో పెళ్లి మండపంలో చూసేసరికి వరుడు ఎంతో ఆనంద పడ్డాడు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన సూర్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే సూర్య హీరోగా తెరకెక్కిన “ఆకాశమే నీ హద్దురా” చిత్రాన్ని దర్శకురాలు సుధా కొంగర ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.ఓటీటీలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం సూర్య గౌతమ్ మీనన్ దర్శకత్వంలో “నవరస” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే తొమ్మిది పాత్రలను తొమ్మిదిమంది దర్శకులు ఒక పైసా తీసుకోకుండా తెరకెక్కించడం విశేషమని చెప్పవచ్చు. ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ లో విడుదల చేసి వచ్చిన లాభాలను ఇండస్ట్రీలోని కార్మికులకు ఇవ్వనున్నట్లు చిత్రబృందం తెలియజేశారు. మరోవైపు హీరో సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ, ఎంతోమందికి జీవితం కల్పిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago