Featured

Hero Uday Kiran Wife Vishitha : హీరో ఉదయ్ కిరణ్ భార్య ఎక్కడుంది… ఏంచేస్తోంది…!

Hero Uday Kiran wife Vishitha : అతి తక్కువ సినిమాలతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ హీరోలలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. ఎంత తొందరగా స్టార్ హీరోలలో ఒకరుగా నిలబడ్డారో అంతే తొందరగా ఫేడ్ అవుట్ అయిపోయారు. సినిమా ఆఫర్లు లేక ఆర్ధిక కష్టాలతో ఆత్మహత్య చేసుకొని ఇప్పటికి 10 సంవత్సరాలు కావొస్తున్నా అభిమనులు ఇంకా ఆయనను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. లవర్ బాయ్ గా ఇప్పటికీ అభిమానులలో చెరగని ముద్ర వేసుకున్నారు ఉదయ్ క్షణికావేశంలో మరణించకపోయుంటే ప్రస్తుతం ఖచ్చితంగా మంచి ఆఫర్స్ తో మనముందు ఉండేవాడేమో. ఇక ఉదయ్ కిరణ్ మరణం తరువాత ఆయన భార్య విషిత గురించి ఎవరికీ ఏ విషయం తెలియలేదు. తాను ఎలా ఉంది ఎక్కడ ఉంది ఏం చేస్తోంది వంటి విషయాలు ఎవరికీ తెలియవు.

ఉదయ్ భార్య విషిత ఏం చేస్తోందంటే…

ఉదయ్ కిరణ్ మొదట మెగాస్టార్ చిరు అల్లుడు కావాల్సింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. సుస్మిత తో ఎంగేజ్మెంట్ అవడం ఆపైన బ్రేక్ అవ్వడం అన్ని న్నీ జరిగాయి. అయితే ఆ తరువాత ఉదయ్ కెరీర్ కూడా బాగా దెబ్బతింది. వరుసగా ఫ్లాప్స్, మంచి ప్రాజెక్ట్స్ చేతిలో లేకపోవడంతో మెల్లగా ఫేడ్ అవుట్ అయ్యాడు ఉదయ్. ఇక ఉదయ్ కిరణ్ చాలా గ్యాప్ తరువాత విషిత అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ లో జాబ్ చేస్తున్న విషిత ఉదయ్ కిరణ్ ను పబ్ లో చూసి పరిచయం పెంచుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఇక ఉదయ్ కిరణ్ కెరీర్ తాలూకు డిప్రెషన్ లో ఉండటంతో చివరకు ఆత్మహత్య చేసుకుని మరణించడం జరిగింది. ఉదయ్ మరణించాక విషిత ఏమైందో ఎవరికీ తెలియదు. అయితే విషిత ఉదయ్ మరణం తరువాత మళ్ళీ పెళ్లి చేసుకోలేదట. ప్రముఖ ఎంఎన్సి లో పనిచేస్తూ నెలకు రెండు లక్షల పైగానే సంపాదిస్తున్నా ఉదయ్ జ్ఞాపకాలతోనే బ్రతికేస్తోందట విషిత. ఉదయ్ జయంతి రోజున అనాధ ఆశ్రమాలకు వెళ్లడం, దాన ధర్మలను చేయడం వంటివి చేస్తూ జాబ్ చేసుకుంటూ తన తల్లిదండ్రులతోనే ఉందట విషిత.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago