Samyuktha Menon: భీమ్లా నాయక్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మలయాళీ బ్యూటీ సంయుక్తా మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భీమ్లా నాయక్ సినిమాలో రానాకి జోడిగా నటించిన ఈ అమ్మడు ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత బింబిసారా సినిమా ద్వారా మంచి హిట్ అందుకుంది. ఇక ఇటీవల ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమా ద్వారా హీరోయిన్గా మారి టాలీవుడ్లో ఇలా హ్యాట్రిక్ హిట్స్ అందుకొని ఫుల్ ఫామ్ లో ఉంది.
ఈ క్రమంలో టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటుంది. ఇటీవల సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అయితే తాజాగా ఈ సినిమా నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ మీద సంయుక్త నిప్పులు చెరిగింది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో సంయుక్త మీనన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఈ మేరకు సంయుక్త ట్వీట్ చేస్తూ..” నా నిరాశను తెలిపే ముందు ఒక విషయం చెప్పాలి. విరూపాక్ష టీమ్ తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలోని అద్భుతమైన నటీనటులతో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరితో కలిసి చేసిన ఈ ప్రయాణం నాకు ఎప్పటికీ మధుర క్షణాలుగా మిగిలిపోతాయి. కానీ ఎస్వీసీసీ నిర్మాణ సంస్థ వారు .నా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఈ ఉగాదికి నా పోస్టర్ రిలీజ్ చేస్తామని మాట ఇచ్చారు. నా పోస్టర్ ఎక్కడ? ఇచ్చిన మాట ఎందుకు తప్పారు అంటూ నిలదీసింది.
ఇలా సోషల్ మీడియా వేదికగా సదరు నిర్మాణ సంస్థను ట్యాగ్ చేస్తూ తనకు జరిగిన అన్యాయం గురించి నిలదీసింది. దీంతో సంయుక్త చేసిన ట్వీట్ పై సదరు నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ మేరకు ఆమెను క్షమాపణలు కోరింది. అంతే కాకుండా వారి తప్పును సరిదిద్దుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని సంయుక్తని కోరింది. దీంతో కొంచం శాంతించిన సంయుక్త సరే ఎదురుచూస్తుంటాను అంటూ సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా సదరు నిర్మాణ సంస్థ మీద సంయుక్త మీనన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…