Featured

Hero Srikanth : శ్రీకాంత్ రెండో కొడుకు రోహన్ సినిమాల్లోకి ఎంట్రీ… కూతురు ఇప్పుడు ఏం చేస్తోంది… రోషన్ రాబోయే సినిమా ఏంటి…: హీరో శ్రీకాంత్

Hero Srikanth : ఫ్యామిలీ హీరోగా మహిళా అభిమానులను సొంతం చేసుకున్న, విలన్ గా చేసినా, సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా చేసినా తెలుగు ప్రేక్షకులకు అభిమానం చురగొన్న హీరో శ్రీకాంత్. హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా అన్నిరకాల క్యారెక్టర్స్ చేస్తూ ఆడియన్స్ ని మైమరిపిస్తున్న నటుడు శ్రీకాంత్. ఇక తన తనయుడు రోషన్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు. ఓవైపు శ్రీకాంత్ సోలో హీరోగా సినిమాలను చేస్తూనే మరో వైపు విలన్ గా చేస్తుండగా కొడుకు రోషన్ కూడా ‘పెళ్లి సందడి’ అంటూ వచ్చి హిట్ కొట్టాడు. అయితే ఆ సినిమా వచ్చి కొంతకాలమైనా మరో సినిమా ప్రకటించకపోవడంతో అసలు నెక్స్ట్ సినిమా ఏంటి అనే విషయాలను అలాగే రెండో కొడుకు రోహన్ సినిమా ఎంట్రీ ఎపుడు అనే విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రీకాంత్ పంచుకున్నారు.

రోహన్ సినిమాల్లోకి ఎప్పుడంటే… కూతురు ఏం చేస్తోంది…

శ్రీకాంత్ గారు ఊహ గారికి ముగ్గురు పిల్లలు. అందులో మొదటి కొడుకు రోషన్ ఆల్రడీ హీరోగా వచ్చేసాడు. ‘నిర్మల కాన్వెంట్’ సినిమాతో పరిచయమైన రోషన్ మళ్ళీ గ్యాప్ తీసుకుని తండ్రి శ్రీకాంత్ హిట్ సినిమా పెళ్లి సందడి టైటిల్ తో వచ్చి హిట్ కొట్టాడు. ఇక మళ్ళీ ఇప్పుడు సినిమా ఇంకా ప్రకటించకపోవడంతో రోషన్ సినిమా ఎపుడుంటుంది అనే ప్రశ్నకు శ్రీకాంత్ చెబుతూ అశ్వినిదత్ గారి బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడు, అదొక పీరియాడిక్ డ్రామా అందుకే బాగా గ్యాప్ తీసుకుంటున్నాడు రోషన్ అంటూ చెప్పారు.

ఇక రెండో కొడుకు రోహన్ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తనకు సినిమాలంటే ఇష్టమని ఆల్రడీ ఒక హిందీ సినిమాలో ప్రభుదేవా కొడుకుగా నటించాడు అంటూ చెప్పారు శ్రీకాంత్. అయితే ఆ సినిమా విడుదల కాలేదని ఆ సినిమా విడుదల అయ్యుంటే బాగుండేదంటూ చెప్పారు. ఇక తెలుగులో చేయడానికి తాను ఇంకా తొమ్మిదో తరగతి చదువుతున్నాడు ఇంకా సమయం ఉంది తను రావడానికి అంటూ చెప్పారు. ఇక కూతురు మేధా గురించి మాట్లాడుతూ తాను కెనడాలో చదువుకుంటోందని, తను స్టడీస్ లో బ్రిలియంట్ అంటూ చెప్పారు. మార్కెటింగ్ కి సంబంధించిన కోర్స్ చేస్తోందని వివరించారు.

Bhargavi

Recent Posts

‘కట్టప్ప’కు కొడుకు షాక్.. తమిళ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు

తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…

5 minutes ago

పెళ్లి చేసుకోబోతుందా సంయుక్త మీనన్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్

మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…

2 hours ago

ఈ ఒక్క పండు మీ గట్ నుంచి గుండె వరకు మార్పు తీసుకురాగలదా?

నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…

2 hours ago

వాట్సాప్‌లో కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్? వినియోగదారులకు రాబోయే మార్పులు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…

2 hours ago

మొబైల్ అలవాటు… సంతానంపై ప్రభావం? జేబులో ఫోన్ పెట్టే ముందు తెలుసుకోండి… మీ ఆరోగ్యానికి ఇది మంచిదేనా?

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…

2 hours ago

ఎండలో నల్లగా మారిన ముఖం? టానింగ్‌కు చెక్ పెట్టే నాచురల్ సీక్రెట్… పార్లర్ ఖర్చు సేవ్!

వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…

2 hours ago