Featured

Hero Srikanth : ఎన్టీఆర్ 30 సినిమాలో నా పాత్ర ఏమిటంటే… ఎన్టీఆర్ నన్ను ఏమని పిలుస్తాడంటే… ఆస్కార్ అవార్డు పై శ్రీకాంత్ రియాక్షన్…!

Hero Srikanth : ఒక్కో మెట్టు ఎక్కుతూ విలన్ గా మొదలై సెకండ్ హీరో క్యారెక్టర్ చేస్తూ ఆ తరువాత సోలో హీరోగా ఎదిగిన శ్రీకాంత్ తన కెరీర్ లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసారు. ఇక ఎక్కువ శాతం మల్టీ స్టారర్ చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ ఆడియన్స్ కి తన సినిమాలతో బాగా కనెక్ట్ అయ్యాడు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో మంచి హిట్స్ అందుకున్న శ్రీకాంత్ ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా నేను చేయగలనని నిరూపించాడు ‘ఖడ్గం’ సినిమాతో, అందులో పోలీస్ ఆఫీసర్ రాధకృష్ణ గా అందరినీ ఆకట్టుకున్నాడు. మహిళా అభిమానులను సొంతం చేసుకున్న శ్రీకాంత్ తన కెరీర్ అలాగే కుటుంబం గురించి ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఎన్టీఆర్ తో నా రిలేషన్…

ప్రస్తుతం వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే సోలో హీరోగాను సినిమాలను చేస్తున్న శ్రీకాంత్ గారు తాజగా కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా విశేషాలను అలాగే తనకు ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం గురించి తెలిపారు. ఎన్టీఆర్ తనను బాబాయ్ అని పిలుస్తాడని చెప్పారు. ఎన్టీఆర్ తో చాలా సరదాగా ఉంటుందని అల్లరి బాగా చేస్తాడంటూ చెప్పారు. ఎన్టీఆర్ తో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ నటించకపోయినా వ్యక్తిగతంగా బాగా తెలుసనీ మంచి రిలేషన్ ఉందంటూ చెప్పారు.

ఇక కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమాలో తన క్యారెక్టర్ విభిన్నంగా ఉండబోతోందంటూ తెలిపారు. ఒకవైపు నెగెటివ్ మరోవైపు పాజిటివ్ గా ఉంటూ కొత్తగా ఉంటుందని, సినిమా మొత్తం ఎన్టీఆర్ తో ఉంటానంటూ కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉందని తెలిపారు. ఇక ఇద్దరు ఆస్కార్ హీరోలతో ఈ ఏడాది సినిమాలు చేస్తున్నానంటూ రామ్ చరణ్ ఎన్టీఆర్ ల గురించి తెలిపారు. తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల చాలా గర్వంగా ఉందని ఆర్ఆర్ఆర్ టీం చాలా అదృష్టవంతులు అలాగే చాలా కష్టపడి అవార్డు సాధించారని ప్రశంసించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago