Categories: FeaturedMovie News

Hero Srikanth : రామ్ చరణ్ షూటింగ్ లో నన్ను ఏమని పిలుస్తాడంటే… ఆర్సి15 లో నా రోల్… పవన్ కళ్యాణ్ ఎలాంటివాడంటే…: హీరో శ్రీకాంత్

Hero Srikanth : ఏ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఏర్పరచుకున్న హ్యాండ్సమ్ హీరో శ్రీకాంత్. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సోలో హీరోగాను హిట్లు అందుకుని మళ్ళీ ఇప్పుడు విలన్ గా దూసుకుపోతున్న ఆర్టిస్ట్ శ్రీకాంత్ గారు. ఇండస్ట్రీలో అందరితోనూ మంచి అనుబంధం కలిగి ఉండి అందరు అగ్ర హీరోల సరసన నటించిన ఆయన మెగా ఫ్యామిలీతో ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చిన శ్రీకాంత్ గారు ఆయన కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటారు. ఇక చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో సినిమాలలో నటించిన ఆయన రామ్ చరణ్ గురించి అలాగే చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యణ్ గురించి ఇంటర్వ్యూలో మాట్లాడారు.

రామ్ చరణ్ ఏమని పిలుస్తాడంటే… పవన్ అలాంటివాడు…

రామ్ చరణ్ చిరంజీవి గారి అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తండ్రికి తగ్గ తనయుడిగా ఎపుడో నిరూపించుకున్నాడు. తానో మంచి కమర్షియల్ హీరోనే కాదు తనలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు అని నిరూపించుకున్నాడు. ఇక రామ చరణ్ గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ తనతో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో నటించినపుడు వ్యక్తిగతంగా తెలుసు కానీ ఆర్టిస్ట్ గా షూటింగ్ లో ఎలా ఉంటాడా అనుకునేవాడిని, తన తండ్రి లాగే తాను తన చుట్టు ఉన్న వారిని ప్రేమగా చూసుకుంటాడు, అందరికీ భోజనం తానే తెప్పించడం మాట్లాడుతూ కబుర్లు చెప్పడం ఇవన్నీ అన్నయ్య దగ్గరి నుండే వచ్చాయి అంటూ చెప్పారు.

ఇక ఇప్పుడు తాజాగా శంకర్ డైరెక్షన్ లో చరణ్ చేస్తున్న సినిమాలో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తన పాత్రను రివీల్ చేయలేనని చెప్పిన ఆయన చరణ్ ఇప్పుడు పాన్ ఇండియ స్టార్ అయినా గోవిందుడు అందరివాదడేలే టైంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. నన్ను శ్రీకాంత్ అన్న అని పిలుస్తాడు చాలా బాగా ఉంటాడు అంటూ చెప్పారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తనతో నటించే అవకాశం ఇప్పటి వరకు రాలేదు కానీ తాను వ్యక్తిగతంగా తెలుసు అంటూ చెప్పారు. పవన్ చాలా నిజాయితీగా ఉండే మనిషి. తాను ఏదైనా చేయాలి అనుకుంటే అది చేసే తీరాలి అన్నట్లు ఉంటాడు అదొక గొప్ప లక్షణం. తను పొలిటికల్ గా ఎలా ఎదుగుతాడో నాకు ఆ లెక్కలు తెలియవు కానీ తాను మంచి పొజిషన్ లో ఉండాలని మాత్రం కోరుకుంటాను అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago