Featured

Hero Srikanth : ఆ సినిమా మిస్ అయిందని చాలా ఫీల్ అయ్యాను… 18 ఏళ్లలో 100 సినిమాలు చేసిన ఏకైక హీరో సక్సెస్ సీక్రెట్ ఏంటంటే…: హీరో శ్రీకాంత్

Hero Srikanth : ఒక్కో మెట్టు ఎక్కుతూ విలన్ గా మొదలై సెకండ్ హీరో క్యారెక్టర్ చేస్తూ ఆ తరువాత సోలో హీరోగా ఎదిగిన శ్రీకాంత్ తన కెరీర్ లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసారు. ఇక ఎక్కువ శాతం మల్టీ స్టారర్ చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ ఆడియన్స్ కి తన సినిమాలతో బాగా కనెక్ట్ అయ్యాడు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో మంచి హిట్స్ అందుకున్న శ్రీకాంత్ ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా నేను చేయగలనని నిరూపించాడు ఖడ్గం సినిమాతో, అందులో పోలీస్ ఆఫీసర్ రాధకృష్ణ గా అందరినీ ఆకట్టుకున్నాడు. మహిళా అభిమానులను సొంతం చేసుకున్న శ్రీకాంత్ తన కెరీర్ అలాగే కుటుంబం గురించి ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

18 ఏళ్లలో 100 సినిమాలు… ఆ సినిమా పోయినందుకు ఫీల్ అయ్యాను…

శ్రీకాంత్ తన కెరీర్ లో అటు మల్టీ స్టారర్ సినిమాలను చేస్తూనే మరో వైపు సోలో హీరోగాను లవ్ స్టోరీలలో నటించి హిట్లు కొట్టాడు. విరామం లేకుండా ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా దాదాపు 18 ఏళ్లలో 100 సినిమాలలో నటించారు. మొదటి సినిమా నుండి ‘మహాత్మ’ వందో సినిమా వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు శ్రీకాంత్. ఇన్ని సినిమాలను చేసినా ఒక్క కాంట్రావెర్సీ లేకుండా ఇండస్ట్రీలో నెట్టుకొచ్చారు. ఇప్పటికీ హీరోగా చేస్తూనే మరోవైపు కుర్ర హీరోల సరసన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న శ్రీకాంత్ తన సినిమా కెరీర్ లో రిగ్రేట్ అయిన సినిమాలను గూర్చి వివరించారు.

అప్పట్లో బిజీ షెడ్యూల్ లో పనిచేసే శ్రీకాంత్ ఎడిటర్ మెహన్ గారి సినిమా ‘మనసిచ్చి చూడు’లో అవకాశం రాగానే కథా అన్ని నచ్చినా డేట్స్ అడ్జస్ట్ చేయలేక వదులుకున్నాడట. అయితే తాను ఆల్రెడీ చేస్తున్న సినిమా ఫ్లాప్ అవగా ఎడిటర్ మోహన్ గారు వడ్డే నవీన్ తీసిన ఆ సినిమా మంచి హిట్ అవడంతో చాలా బాధేసింది అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. అటువంటి సినిమాలు ఇంకా కొన్ని ఉన్నాయంటూ తెలిపారు శ్రీకాంత్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago