Hero Venkatesh makeupman Raghava : రామానాయుడు గారి కుటుంబం నుండి సినిమా ఇండస్ట్రీకి ఎంతో చేశారు. ఆయన సినిమాలను నిర్మిస్తూ సినిమా షూటింగ్స్ కోసం స్టూడియో నిర్మించారు. ఇక ఆయన మొదటి కొడుకు సురేష్ బాబు నిర్మాతగా సినిమా నిర్మాణంలో ఉండగా మరో కొడుకు వెంకటేష్ హీరోగా అగ్రహీరోల్లో ఒకడిగా నిలిచి ఎక్కువగా కుటుంబ ప్రేక్షకులకు మహిళా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఒకవైపు కామెడీ చేస్తూనే మరోవైపు సెంటిమెంట్ ను పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు వెంకటేష్. దగ్గుబాటి కుటుంబం మీద ఒక్క రూమర్ కానీ, వివాదం లేకుండా నిలిచారు. ఇక ఆ కుటుంబం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను వెంకటేష్ వ్యక్తిగత మేకప్ మాన్ రాఘవ మాట్లాడారు.
ఆస్తుల పంపకం… కుటుంబంలో గొడవలు…
మేకప్ మాన్ రాఘవ మాట్లాడుతూ ఇన్నేళ్ల నుండి దగ్గుబాటి ఫ్యామిలీ అందరికీ తెలుసు కానీ ఒక్కసారి కూడా వారి మీద చిన్న వివాదం కూడా ఉండదు. ఇక రామా నాయుడు గారు మరణించిన తరువాత కూడా వారి ఇంట్లో ఆస్తుల గురించి ఏ చిన్న గొడవ కానీ వార్త కానీ బయటకు రాలేదు. అంత అందంగా ఆ కుటుంబం ఉంటుంది అంటూ రాఘవ చెప్పారు.
కుటుంబంలో అందరూ చాలా చక్కగా ఉంటారు, నిర్మాణ సంస్థ గురించి మొత్తం ప్రొడక్షన్ పనులను సురేష్ బాబు చూసుకుంటారు, వెంకటేష్ అసలు ఆ విషయాలను పట్టించుకోరు. ఇక పిల్లలు కూడా అంకుల్, ఆంటీ ఈ పిలుపులు ఉండవు. కేవలం బాబాయ్ పిన్ని పెదనాన్న ఇలానే ఉంటాయి. అందరూ కలిసి మెలిసి ఉంటారు. విబేధాలు లేని ఏకైక ఫ్యామిలీ దగ్గుబాటి ఫ్యామిలీ అంటూ చెప్పారు రాఘవ. ఇక వారు తమతో పని చేసేవారిని కూడా చాలా బాగా చూసుకుంటారు అంటూ చెప్పారు రాఘవ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…