Featured

Hero Sumanth Aswin : చెన్నైలో ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది… ప్రమోషన్స్ కి పిలిచినా మహేష్ బాబు రాకపోడానికి కారణం..: హీరో సుమంత్ అశ్విన్

Hero Sumanth Aswin : సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ అనగానే వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్ధంటానా వంటి వరుస హిట్ సినిమాలు అందరికీ గుర్తొస్తాయి. కేవలం నిర్మాత అంటే సినిమాలకు డబ్బు ఇవ్వడం కాదు, నిర్మాత సినిమా తీయాలనే అభిరుచి ఉంటే అతనే కథ తయారుచేసుకుని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఎమ్ఎస్ రాజు గారు చూపించారు. ఇక ఆయన నిర్మాణ సంస్థనుండి సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా సినిమా సూపర్ అనేంతలా ఆయన బ్రాండు ను క్రియేట చేసుకున్నారు. ఇక ఆయన కొడుకుగా సినిమాల్లోకి అడుగుపెట్టిన సుమంత్ అశ్విన్ తూనిగా తూనిగా, కేరింత అంటూ కొన్ని సినిమాల్లో నటించిన పెద్దగా ఇంకా రాణించలేదు. ఎంతో మంది హీరోలను సుపర్ స్టార్లను చేసిన ఎమ్ఎస్ రాజు గారు ఆయన కొడుకును హీరోగా నిలబెట్టడానిక ఇటీవల సినిమా ఆయనే డైరెక్షన్ చేసినా పెద్దగా ఆడలేదు.

చెన్నైలో ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది…

ఎమ్ఎస్ రాజు గారు హీరో, డైరెక్టర్ కాంబినేషన్ సినిమాలకు దూరం. కేవలం కథను నమ్మి సినిమా తీయాలని అనుకుంటారు. కథకు తగ్గట్టు హీరోను సెలెక్ట్ చేసుకుంటారు. అయితే కొన్ని సార్లు ఆయన అంచనాలు తప్పడం వల్ల ప్రస్తుతం ఆయన ఫ్లాపులను ఎదుర్కొంటూ చాలా వరకు ఆర్థికంగా కూడా బాగా నష్టపోయారు. ఇక అలా ‘వాన’ లాంటి సినిమాలకు నష్టపోవడం వల్ల చెన్నైలోని కొన్ని ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది అంటూ ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక రాజు గారు సూపర్ హిట్లిచ్చి హీరోలను స్టార్లుగా చేసారు.

ఆ హీరోలందరూ ప్రస్తుతం సూపర్ స్టారలుగా ఉన్నారు. మరి వాళ్ళు సుమంత్ సినిమా ప్రమోషన్స్ కి వస్తే కొంతైనా సినిమా కు హైప్ ఉంటుంది కదా అన్న ప్రశ్నకు సుమంత్ క్లారిటీ ఇచ్చారు. చరణ్ తో అసలు పనిచేయలేదు. కానీ ఆయన సినిమా ప్రొమోషన్స్ చేసారు. ఇక మహేష్ బాబు ను ఇంతకుముందు ఎపుడూ అడగలేదు. అయితే ఒక సినిమా కోసం అడిగినపుడు ఆయన యూరప్ ట్రిప్ లో ఉండటం వల్ల రాలేకపోయారు అంటూ చెప్పారు. ఇక వెంకటేష్ గారు కూడా పిలిచినా వెంటనే వచ్చి ప్రమోట్ చేసారు అంటూ క్లారిటీ ఇచ్చారు సుమంత్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago