Ram Gopal Varma : వివాదాలతో బతికే జీవి ఆర్జీవి. ఏదో ఒక విషయంలో కాంట్రవెర్సీ క్రియేట్ చేసి తనని తాను ప్రమోట్ చేసుకుంటూ ఉండే ఆర్జీవి మరోసారి అందరికీ షాక్ ఇచ్చాడు. సినిమాకు ప్రమోషన్స్ వింతగా చేసే ఆర్జీవి తాను తీసిన సినిమాలను జనాలు ఎపుడో మర్చిపోయినా తాను చేసే, మాట్లాడే కాంట్రావెర్సీల కోసం మాత్రమే ఎదురుచూస్తుంటారు. అయితే ఇదంతా ఇప్పుడు, ఒకప్పుడు వర్మ వేరు. తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్ ను తెచ్చిన ట్రెండ్ సెట్టర్ వర్మ. ‘శివ’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా తీరును మార్చేశాడు. స్టడీ కెమెరాను వాడి సినిమా విజువల్స్ కి కొత్తదనం తీసుకోచ్చి అందరినీ ఆకర్శించాడు వర్మ. ఇక శివ సినిమా గురించి మరిన్ని విశేషాలను వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
మోహన్ బాబు ని ఆ పాత్రకు వద్దని చెప్పా…
శివ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నామంటే ఆ సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట చేసిందో అర్థమవుతుంది. కొత్తదనం అంతా ఆ సినిమాలో కనిపిస్తుంది. సినిమాల్లో నటించిన నటీనటులు అందరూ కొత్తగా కనిపించడం, అలానే ప్రతి ఒక్కరినీ వర్మ డిజైన్ చేసిన తీరు వల్లే ఆ సినిమా మరింత హిట్ అయింది. అయితే ఆ సినిమాలోని క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతూ అందులో స్టూడెంట్ లీడర్ గా ఉన్న జేడి పాత్ర గణేష్ అనే ఒక రౌడీ అండ చూసుకుని కాలేజీలో రౌడీఇజం చెలాయిస్తుంటాడు. అయితే గణేష్ పాత్ర మెయిన్ విలన్ భవాని తరువాత అంతటి కీలక పాత్ర, ఆ పాత్ర కోసం చర్చిస్తున్నపుడు వెంకట్ అక్కినేని మొదట మోహన్ బాబు పేరును చెప్పారట.
నాగార్జునను బెదిరించే పాత్రలో పవర్ ఫుల్ వ్యక్తి ఉంటే బాగుంటుంది అని ఆయనతో మాట్లాడుతా అని చెప్పాడట. అయితే వర్మ స్టైల్ డిఫరంట్. మోహన్ బాబు గారికి ఆల్రడీ ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ ను దాటి ఆయనను ప్రేక్షకులు ఈ క్యారెక్టర్ లో చూస్తారని వర్మ అనుకోలేదు, అందుకే వద్దని నాగార్జున పక్కన బాగోదని చెప్పేశారట. ఆ పాత్రలో కొత్త వాడైతే ప్రేక్షకులు ఇతను ఏమి చేస్తాడు అనే భయంలో సస్పెన్స్ ఫీల్ అవుతారు. అదే మోహన్ బాబు ని పెడితే అలా ఉండదు ప్రేక్షకుల ఆలోచన అని అనుకున్నారట. అందుకే ఆ పాత్రకు విశ్వనాధ్ అనే కొత్త ఆర్టిస్టు ను తీసుకున్నారు వర్మ. ఏమైనా అప్పటి వర్మ థింకింగ్ డిఫరెంట్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…