Actress Anjali: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి అంజలి ఒకరు ఈమె కెరియర్ మొదట్లో తమిళ సినిమాలలో చేసేవారు అనంతరం తమిళ సినిమాలు తెలుగులో డబ్బయి ఇక్కడ కూడా మంచి అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈమె నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి.
ఇలా కెరియర్ పరంగా మంచి పొజిషన్లో ఉన్న సమయంలోనే అంజలి గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో అలాగే కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొట్టాయి ఈమె ఒక కోలీవుడ్ హీరో తో ప్రేమలో పడిందని తద్వారా తన జీవితమే కోల్పోయింది అంటూ అప్పట్లో వార్తలు బలంగా వినిపించాయి. ఇప్పటికీ కూడా అంజలి అంటేనే హీరో జై తో ఉన్న రిలేషన్ అందరికీ గుర్తుకు వస్తుంది.
జర్నీ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందట ఇలా పీకల్లోతు ప్రేమలో ఉన్న వీరిద్దరూ సహజీవనం కూడా చేశారు. ఇక అంజలి సినిమాలకు సంబంధించిన వ్యవహారాలన్నింటిని కూడా జై చూసుకొని వారు ఆమె ఎవరితో మాట్లాడాలన్నా ఆయన పర్మిషన్ కావాలి అలాగే అంజలి సంపాదించిన ఆస్తులను కూడా కాజేశారని ఈయన వల్లే అంజలి ఎన్నో సినిమా అవకాశాలను కూడా కోల్పోయిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి.
ఇలా క్రమక్రమంగా తన సంపాదించిన ఆస్తులు కరిగిపోవడం అలాగే సినిమా అవకాశాలు లేకపోవడంతో అంజలి ఈ విషయం నుంచి వెంటనే తేరుకొని తనకు బ్రేకప్ చెప్పారనే తెలుస్తుంది. ఇలా జై కి బ్రేకప్ చెప్పిన అనంతరం అంజలి కెరియర్ పై ఫోకస్ పెట్టి తిరిగి వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…