“కేజీఎఫ్” ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఏవిధమైన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సైలెంట్ గా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. “యశ్” అసలు కేజీఎఫ్ సినిమా విడుదలకు ముందు యశ్ ఒక సాధారణ హీరో.. అసలు కన్నడ లో తప్ప ఇతర భాషల్లో ఎవరికీ తెలియదు. కానీ సినిమా రిలీజ్ అతని కెరీర్ గ్రాఫ్ అమాంతం పెంచేసింది. ఒక్కసారిగా అతని కెరీర్ మారిపోయింది. సెన్సేషనల్ యాక్టర్ గా తీర్చిదిద్దింది కెజిఎఫ్ సినిమా. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని దేశంలోని సినీ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు అంటే కెజిఎఫ్ ప్రభంజనం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఒక్క సినిమాతో కన్నడ ఇండస్ట్రీని శాసించే స్థాయికి యశ్ ఎదిగాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అయన తన గతం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.
యశ్ చిన్నప్పుడు కేవలం 300రూ లతో యాక్టర్ కావాలని ఇంట్లోంచి పారిపోయి బెంగళూర్ వచ్చేసాడట. ఆ తరువాత చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడట. “నేను ఇంట్లోంచి పారిపోయి బెంగళూరు కు వచ్చేసాను. ఆ రోజుల్లో అసలు ఇంత పెద్ద మహానగరంలో ఎలా బ్రతకాలి అని చాలా భయపడ్డాను. కానీ ఎప్పుడు ఆత్మవిస్వాసంతోనే ఉన్నాను. వెనకడుగు వేయకుండా ముందుకు సాగాను. బెంగళూరు చేరుకోగానే నాదగ్గర కేవలం 300రూపాయిలు మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో తిరిగి ఇంటికివెళ్ళి ఇంట్లో నా మొహం చూపించలేని పరిస్థితి. అందుకే ఏది ఏమయినా యాక్టర్ గా నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నా. నేను తిరిగి ఇంటికి వచ్చేస్తాను అని ఇంట్లో వాళ్ళు భావించారు. కానీ లక్కీగా ఒక వ్యక్తి నన్ను థియేటర్లో పనికి తీసుకున్నాడు. ఆ టైంలో ఆ పనిగురించి నాకు ఏమి తెలియదు. పార్ట్ టైం జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాను. టీ లు అందించాను. మరెన్నో రకాల పనులు చేశాను. చాలా ప్లేసెస్ తిరిగాను. స్టేజిపై నా తోలి ప్రదర్శనను గుర్తించి నాకు సినిమాలో అవకాశాన్ని ఇచ్చారు.” అంటూ తన లైఫ్ లో జరిగిన విషయాలను పంచుకున్నారు హీరో యాశ్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…