Heroien Kanchan : చాలా మంది డబ్బు సంపాదించి స్థిరపడ్డాక తాము సంపాదించిన దానిలో కొంత ధార్మిక కార్యక్రమాలకోసమో దానధర్మాల కోసమో వినియోగిస్తూ ఉంటారు. కానీ ఈ అలనాటి హీరోయిన్ మాత్రం తన మొత్తం ఆస్తిని టిటిడి ట్రస్ట్ కి రాసిచ్చింది. ఆమె మరెవరో కాదు ‘అవే కళ్ళు’ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న నటి కాంచన. తమిళనాడులో పుట్టిన తెలుగమ్మాయి కాంచన అసలు పేరు వసుంధర దేవి. తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండటంతో కుటుంబ బాధ్యతలను తన నెత్తిన వేసుకుని ఉద్యోగం కోసం ప్రయత్నించిన తొలినాళ్ళలో సినిమాల్లో వన్ అఫ్ ది డాన్సర్ గా చేసింది. అయితే అందులో వచ్చే డబ్బు కుటుంబ పోషణకు సరిపోదని భావించి ఎయిర్ హోస్టస్ గా చేరింది. అలా విమాన ప్రయాణంలో ఆమెను చూసిన డైరెక్టర్ శ్రీధర్ తమిళంలో ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న కాంచన ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమెకు కాంచన అనే పేరును కూడా శ్రీధర్ గారే పెట్టారు.
మొత్తం ఆస్తి దేవదేవుడికి… నేడు ఆర్థిక ఇబ్బందులతో…
కాంచన మొదటి నుండి కుటుంబం కోసం డబ్బు సంపాదించారు. 1964 నుండి 77 వరకు చాలా వరకు తమిళంలో అగ్ర హీరోయిన్ గా వెలుగు వెలిగిన కాంచన తెలుగులోను మంచి విజయాలను చూసారు. అయితే తండ్రే మోసం చేస్తాడని ఊహించలేక పోయింది. కళ్యాణ మంటపం సినిమా నిర్మాణం సమయంలో డబ్బు కావాలని అడిగినప్పుడు కానీ తండ్రి చేసిన మోసం అర్థం కాలేదు. మొత్తం ఆమె సంపాదించిన ఆస్తిని తన పేరున కాంచన తండ్రి మార్చుకున్నారు. దీంతో లీగల్ గా తన ఆస్తి తనకు దక్కటం కోసం న్యాయ స్థానంలో పోరాడి చివరకు తన ఆస్తి సంపాదించుకుంది.
అయితే న్యాయస్థానంలో పోరాడే సమయంలోనే తిరుమల వెంకటేశ్వరుడికి కేసు గెలిస్తే ఆస్తి మొత్తం రాసిస్థానని మొక్కు మొక్కారట కాంచన. అలా కోర్ట్ లో కేసు గెలిచి ఆస్తి తనని చేతికి రాగానే ఆస్తి మొత్తం 40 కోట్లు తిరుమల దేవుడికి రాసేసింది. పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగా మిగిలిన కాంచన ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదురకొంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోనే ఉంటున్నారని, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…