Featured

Cricketer Hardik Pandya : సహచర ఆటగాడిపై బూతులతో రెచ్చిపోయిన పాండ్య… తీరు మార్చుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్…!

Cricketer Hardik Pandya : భారతీయులు అనగానే సహనం చూపిస్తామనే పేరుంది. ఇక క్రికెట్ లో కెప్టెన్ గా ఉన్న వ్యక్తులు ఇప్పటి వరకు ఆ పేరును అలానే నిలబెట్టారు. వేరే దేశంతో ఆడేటపుడు నోరుజారాకుండా ఇండియా పరువు నిలబెట్టారు. అయితే ఇప్పుడు మాత్రం భారత ఆటగాడు హార్దిక్ పాండ్య సహచర ఆటగాడితో నడుచుకున్న తీరు విమర్శల పాలయింది. నెటిజన్స్ నుండి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. క్రికెటర్ గా ఎంత టాలెంట్ ఉన్నా ఎదుటివారికి మర్యాద ఇవ్వడం నేర్చుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు చాలా మంది నెటిజన్స్.

సుందర్ ను బూతులు తిట్టిన హార్దిక్…

శ్రీలంక తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో వైస్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్య సహనాన్ని కోల్పోయి సహచర ఆటగాడినే బూతులు తిట్టాడు. ఇన్నింగ్స్ సమయంలో 11 ఓవర్ లో నీళ్ల బాటిల్ ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో హార్దిక్ పాండ్య తన సహచర ఆటగాడైనా వాషింగ్టన్ సుందర్ ను అసభ్య పదజాలంతో దూషించాడు. నీళ్లు ఇవ్వకుండా ఎవని… (G**nd Mara Rahe Ho udhar) అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు.

అయితే పాండ్య మాట్లాడిన మాటలు స్టంప్ మైక్ లో రికార్డు అవడంతో సోషల్ మీడియా వరకు చేరి పోయాయి. ఇక దీనికి సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవడంతో పాండ్య మీద నెటిజన్స్ విరుచుకు పడుతున్నారు. క్రికెట్ ఆడటం కాదు ముందు మాట్లాడటం, ఓర్పుగా ఉండటం నేర్చుకో అంటూ కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ఇండియా పరువు తీయొద్దు వైస్ కెప్టెన్ అయినంత మాత్రాన ఇంత పొగరు పనికిరాదు అంటూ ఏకి పారేస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago