Senior Actor Naresh : విజయ నిర్మల కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు నరేష్ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకవైపు కామెడీ హీరోగా ఎన్నో విజయాలను చూసిన నరేష్ మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా మాత్రం నరేష్ తన మూడు పెళ్లిళ్ల ద్వారా బాగా వైరల్ అవుతున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నరేష్ పవిత్ర లోకేష్ ల ఇష్యూ బాగా ఫేమస్. వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు అని వార్తలు వినిపించినా తాజాగా పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ వీడియో విడుదల చేసారు. మూడో భార్యకు విడాకులు ఇవ్వకుండా పవిత్రలోకేష్ తో తిరుగతున్నాడు నరేష్. అయితే నరేష్ మూడో భార్య మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ వైరల్ అవుతుండగా నరేష్ రెండో భార్యతో ఎందుకు విడిపోయాడు అనే విషయం గురించి చర్చిస్తున్నారు.
రెండో భార్యతో విడిపోయింది అందుకే…
నరేష్ మొదటి భార్య ప్రముఖ కెమెరామెన్ శ్రీను కూతురు కాగా ఒక కొడుకు పుట్టాక మనస్పర్థసల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఇక వీళ్ళు విడిపోక ముందే రేఖ సుప్రియ తో పరిచయం ఏర్పడింది. రేఖ సుప్రియ ప్రముఖ అభ్యుదయ వాది, రచయిత దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి మనవరాలు అలాగే బుజ్జయి రచయిత సుబ్బరాయ శర్మ కూతురు. సుబ్బరాయ శర్మ గారికి విజయ నిర్మల గారికి మంచి స్నేహం ఉండటం వల్ల మొదటి భార్యతో విడిపోయాక నరేష్ కు రేఖ సుప్రియ తో రెండో పెళ్లి చేసారు. కొన్నేళ్లు సజావుగా సాగిన సంసారం రెండో కొడుకు పుట్టాక గొడవలు మొదలయ్యాయి.
రెండో కొడుకు ఆటిజంతో పుట్టడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోవాలని అనుకున్నారు. మొదటి కొడుకు కస్టడీ నరేష్ కోరడంతో కోర్ట్ అతనికి మొదటి కొడుకును అప్పగించగా రెండో కొడుకును రేఖ సుప్రియ పెంచారు. ఆ అబ్బాయిని ఉన్నత చదువులు చదివించగా నేడు గొప్ప పెయింటర్ గా ఒక్కో పెయింటింగ్ కు లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నాడు. రేఖ సుప్రియ తన కొడుకులాగా ఆటిజం సమస్యతో బాధపడుతున్న అలాంటి మరో 25 మంది పిల్లలని కూడా ఒక ఆర్గనైజషన్ స్థాపించి చూసుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…