Categories: FeaturedMovie News

45 సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా.. నాగార్జున మోసం చేసాడట పాపం..!!

శ్రీను వైట్ల డైరక్షన్ లో ఆకాష్ హీరోగా తెరకెక్కిన “ఆనందం” సినిమా అప్పట్లో యూత్ ఆడియెన్స్ కు బాగా నచ్చింది. ఆ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది కన్నడ కస్తూరి, అందాల ముద్దు గుమ్మ రేఖ వేదవ్యాస్. అప్పటికే రామోజీ రావు ప్రొడక్షన్ లో 2001 లో చిత్ర అనే ఒక కన్నడ సినిమా లో NRI గర్ల్ పాత్ర మాత్రమే చేసిన అనుభవం ఉన్న రేఖ “ఆనందం” సినిమాలో చాలా బాగా నటించింది. ఈ సినిమా విడుదల అయ్యి పదిహేనేళ్లు అయ్యింది. ఆ తర్వాత నందమూరి తారకరత్న హీరోగా డెబ్యూ మూవీ “ఒకటో నంబర్ కుర్రాడు” సినిమాలో ఆమె లక్కీ ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఆ మూవీలోని పాటలు ఇప్పటికి సూపర్ హిట్ అనిపిస్తాయి. అంతకుముందు “జాబిలి” అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలు హిట్ అయితే రేఖ కెరియర్ ఇంకాస్త జోష్ గా ఉండేది.

అదే సమయం లో కింగ్ నాగార్జున, విజయభాస్కర్ డైరక్షన్ లో వచ్చిన “మన్మథుడు” సినిమాలో రేఖకు ఓ స్పెషల్ అప్పియరెన్స్ నటించే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా చేస్తున్న సమయంలోనే నాగార్జున తనకు మరో సినిమా అవకాశం తప్పకుండా ఇస్తా అని మాట ఇచ్చారట. కాని ఇప్పటివరకు నాగార్జున నుండి అలాంటి కాల్ రాలేదని అంటుంది రేఖ. కొన్నాళ్లుగా తెలుగు పరిశ్రమకు దూరమైన ఈ అమ్మడు కన్నడలో మాత్రం కొన్ని సినిమలు చేసి అప్పట్లో కాస్త బిజీ హీరోయిన్ గా ఉండేది. ఇప్పటి వరకు కెరీర్ మొత్తంగా తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కలిపి 45 సినిమాల వరకు నటించింది. చివరగా ఓంకార్ దర్శకత్వంలో “జీనియస్” అనే సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. ఇక 2014 నుండి సౌత్ ఇండియాలో ఎక్కడ ఎలాంటి సినిమాలోనూ రేఖ నటించలేదు.

బెంగుళూరు లో పుట్టి పెరిగిన రేఖ BBA కరస్పాండెన్స్ కోర్స్, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుండి పూర్తి చేసింది. ఇక బుల్లితెరలో ప్రసారం అవుతున్న ఒక షోకి గెస్ట్ గా వచ్చిన రేఖ కొని విషయాలు మీడియా తో పంచుకున్నారు. ఇక అప్పట్లో తాను బ్రతికిఉండగానే చనిపోయాను అంటూ వార్తలు వచ్చాయని చెప్పుకోచ్చింది రేఖ. నాగార్జున తో నటించే అవకాశం వస్తే ఇప్పుడైనా ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు సిద్ధమే అంటుంది రేఖ. మరి నాగార్జున ఈ అమ్మడి అభ్యర్ధనని పట్టించుకున్తాడో లేదో చూడాలి. రేఖకి మాత్రం తెలుగు సినిమా చేయడమంటే ఇప్పటికి ఆసక్తి అని చెప్పింది.

ఇక ఈ 33 ఏళ్ళ ఈ సుందరి ఇంకా పెళ్లి చేసుకోలేదు. అప్పుడప్పుడు మోడలింగ్ చేస్తూ కాలక్షేపం చేస్తుంది. కానీ ఇప్పుడు రేఖను చుసిన వారంతా ఈమేనా మన “ఆనందం” సినిమాలో నటిచింది అని డౌట్ పడుతున్నారు. ఏజ్ తో పాటు వచ్చే ఫిజికల్ మార్పుల వల్ల రేఖ వేదవ్యాస్ గుర్తుపట్టలేకుండా ఉంది. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. మరి మరీనా ఫిజిక్ తో మల్లి హీరోయిన్ గా రాణించడం కష్టమే కాబట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా సరి పెట్టుకుంటుందేమో ఈ అమ్మడు వేచి చూడాలి.

రేఖ వేదవ్యాస్ తాజా ఫొటోస్ మీకోసం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

చిన్నారుల్లో పెరుగుతున్న SMA… రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఎందుకు అవసరం?

ఇటీవలి కాలంలో చిన్నారులను ప్రభావితం చేసే అరుదైన వ్యాధులలో Spinal Muscular Atrophy (ఎస్‌ఎంఏ) గురించి తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…

2 minutes ago

యోగా గురించి మీరు నమ్ముతున్నవి నిజమేనా? నిపుణుల హెచ్చరిక!

ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…

32 minutes ago

15 ఏళ్లుగా సమోసాలకు దూరం.. అక్షయ్ సీక్రెట్ ఇదే!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్‌నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…

50 minutes ago

“లీసా” నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది – హీరోయిన్ అనన్య నాగళ్ల

అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ)…

56 minutes ago

ఆరోగ్య రహస్యం మీ ఇంట్లోనే ఉంది… రోజూ అరటిపండు తింటున్నారా?

మన రోజువారీ జీవితంలో సులభంగా దొరికే పండ్లలో అరటిపండు ఒకటి. పండగలు, శుభకార్యాలు, ఇంటి వేడుకలు ఏవి జరిగినా ముందుగా…

1 hour ago

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. 12 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై విద్యార్థుల్లో ఆనందం నింపాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తూ, ఈ…

1 hour ago