Categories: FeaturedMovie News

Heroine Amani : చిరంజీవి అంటే పిచ్చి కానీ ఆయన సినిమా నుండే నన్ను తీసేసారు…: హీరోయిన్ ఆమని

Heroine Amani : సహజమైన తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని సగటు ఇల్లాలి పాత్రలలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హీరోయిన్ ఆమని. హీరోయిన్ గా మంచి పాత్రలను చేసి తన నటనను నిరూపించుకున్న ఆమని ప్రస్తుతం సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ, అటు బుల్లితెర మీద కూడా సందడి చేస్తోంది. ఇటీవలే ఎమ్సీఏ, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలలో నటించింది. ఇక బుల్లితెర మీద అటు రియాలిటీ షోకి అప్పుడప్పుడు జడ్జి గా వ్యవహారిస్తూ సీరియల్స్ కూడా నటిస్తూ అలరిస్తున్న ఆమని తన కెరీర్ అలాగే వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

చిరంజీవి అంటే పిచ్చి… కానీ ఇప్పటివరకు నటించలేదు…

సినిమాల్లో నటిస్తే హీరోయిన్ గానే నటించాలి అని ఇండస్ట్రీకి వచ్చిన ఆమని మొదట్లో బాగా ఇబ్బందులు పడినా చివరకు సినిమాల్లో హీరోయిన్ గానే తన కెరీర్ మొదలు పెట్టింది. అలా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పించిన ఆమనికి మెగాస్టార్ చిరంజీవి గారంటే చాలా ఇష్టమట. తన డ్రీమ్ హీరో చిరునే అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన ఆమని ఆయనతో కలిసి నటించే అవకాశం రిక్షావోడు సినిమాలో మిస్ అయినందుకు చాలా బాధపడిందట.

మొదట ఆమని ని హీరోయిన్ గా తీసుకున్నా సినిమా షూటింగ్ మొదలు పెట్టక ముందే డైరెక్టర్ మార్పు జరగడంతో ఆమని ప్లేసులో నగ్మా ను తీసుకున్నారట. దాంతో ఆమని గారు చిరుతో నటించే అవకాశం కోల్పోయారు. సౌందర్య, ఆమని ఇద్దరూ మంచి స్నేహితులు కాగా అప్పటికే ఇద్దరి కాంబినేషన్ లో సినిమాలను చేసారు. మరోసారి మన ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తోంది అని సౌందర్య కాల్ చేసి మరీ చెప్పిందట. కానీ మిస్ అయ్యాక బాధపడ్డారట.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago