Heroine Amani : సహజమైన తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని సగటు ఇల్లాలి పాత్రలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హీరోయిన్ ఆమని. హీరోయిన్ గా మంచి పాత్రలను చేసి తన నటనను నిరూపించుకున్న ఆమని ప్రస్తుతం సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ, అటు బుల్లితెర మీద కూడా సందడి చేస్తోంది. ఇటీవలే ఎమ్సీఏ, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలలో నటించింది. ఇక బుల్లితెర మీద అటు రియాలిటీ షోకి అప్పుడప్పుడు జడ్జిగా వ్యవహారిస్తూ, సీరియల్స్ కూడా నటిస్తూ అలరిస్తున్న ఆమని తన కెరీర్ అలాగే వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
నా ముందే అతను మంటల్లో కాలిపోయాడు…
ఆమని గారికి హీరోయిన్స్ లో సౌందర్య గారంటే చాలా ఇష్టం. తనతో చాలా సన్నిహితంగా ఉండేవారట. ఇద్దరూ వారి వ్యక్తిగత విషయాలను కూడా పంచుకునేవారట. అలాంటి ఆమని సౌందర్య మరణించినపుడు చూడటానికి వెళ్ళలేదు. దానికి కారణం మంటల్లో కాలిపోయిన వారిని చూసి తట్టుకునే శక్తి లేకపోవడం. ఇందుకు కారణం ఆమె సినిమాలో హీరోయిన్ గా చేసే సమయంలో ఒక సినిమా డ్యూయెట్ సాంగ్ చిత్రీకరణ అప్పుడు నిప్పు మధ్యలో డాన్స్ చేసే సీన్ డిజైన్ చేశారట. ఆ సినిమాలో సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న లోకనాథ్ గారు క్రేన్ సహాయంతో పైన నిల్చొని సీన్ తీస్తూ మంట సరిపోలేదని కిందకు వచ్చి పెట్రోల్ తానే తీసుకుని అక్కడున్న బండల మీద చల్లుతుండగా అప్పటికి ఆ బండలపై నిప్పులేకపోయినా ఎక్కడో ఒక రవ్వ ఉండటంతో అది అంటుకుని రివెర్స్ లో ఆయన వైపుకు వచ్చిందట.
ఆ సమయంలో ఆయన చెంబులో ఉన్న పెట్రోల్ తన మీదే పోసుకోవడంతో నిప్పు అంటుకుని కాలిపోయాడు. అక్కడే చూస్తూ ఉన్న అందరూ ఏమి చేయలేకపోయారట. అది ప్రత్యక్షంగా చూసిన ఆమని గారికి అప్పటి నుండి నిప్పుల్లో కాలిన వారిని చూడాలంటే భయమట. లోకనాథ్ గారు దాదాపు 15 రోజులు హాస్పిటల్ లో చికిత్స అందుకుంటూ మరణించారట. హాస్పిటల్ వద్దకు వెళ్లి ఆయన భార్యను కలిసి వచ్చేదాన్ని కానీ ఆయనను చూసే ధైర్యం చేయలేక పోయేదాన్ని, ఒక ఆరు నెలలు ఆయన కాలిపోయిన సంఘటన గుర్తొచ్చి భయపడేదాన్ని అంటూ అందుకే సౌందర్య మరణించినపుడు కూడా వెళ్ళలేదు అంటూ చెప్పారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…