Tarakaratna Daughter: నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయ్యి గత 23 రోజుల నుంచి నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ శనివారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఇలా 23 రోజులపాటు చికిత్స అందిస్తున్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా తారకరత్న మరణించడంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
తారకరత్న మరణించడంతో ప్రత్యేక అంబులెన్స్ లో ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్లోని తన సొంత ఇంటికి తరలించారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు సన్నిహితులు తారకరత్న ఇంటికి చేరుకొని ఆయనను కడసారి చూస్తూ నివాళులు అర్పిస్తున్నారు.ఈ క్రమంలోనే తన తండ్రి అలా నిర్జీవంగా పడి ఉండటం చూసి తన కుమార్తె ఒక్కసారిగా కన్నీటి పర్యంతరమయ్యారు.
తారకరత్న కుమార్తె నిష్క తన తండ్రి భౌతిక కాయాన్ని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ వెక్కి వెక్కి ఏడ్చారు. ఇలా తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటే ఈమె ఒక్కసారిగా ఎమోషనల్ అవ్వడంతో ఇతర కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పర్యంతరమయ్యారు అయితే అక్కడ ఉన్నటువంటి వారు కొందరు నిష్కను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ చిన్నారి మాత్రం ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.
ఇలా తండ్రి ఇక ఎప్పటికీ తనతో మాట్లాడలేడు తనని చూడలేడు అని తెలిసి ఆ చిన్నారి ఎంతో ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.ప్రతి కూతురికి తండ్రితో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఇలా ఉన్నఫలంగా తన తండ్రి మరణించడంతో ఆ కూతురు బాధ వర్ణాతీతం అని చెప్పాలి. ఈ క్రమంలోనే తారకరత్న మరణించడంతో ఆ చిన్నారి సైతం తనకు తండ్రి ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…