Featured

Heroine Amani : మంచి చేస్తే నా మీదే కేసు పెట్టింది…: నటి ఆమని

Heroine Amani : సహజమైన తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని సగటు ఇల్లాలి పాత్రలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హీరోయిన్ ఆమని. హీరోయిన్ గా మంచి పాత్రలను చేసి తన నటనను నిరూపించుకున్న ఆమని ప్రస్తుతం సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ, అటు బుల్లితెర మీద కూడా సందడి చేస్తోంది. ఇటీవలే ఎమ్సీఏ, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలలో నటించింది. ఇక బుల్లితెర మీద అటు రియాలిటీ షోకి అప్పుడప్పుడు జడ్జిగా వ్యవహారిస్తూ, సీరియల్స్ కూడా నటిస్తూ అలరిస్తున్న ఆమని తన కెరీర్ అలాగే వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

నా మీద కేసు పెట్టింది అందుకే…

ఆమని గారి తండ్రి డిస్ట్రిబ్యూటర్ గా ఉండటం వల్ల సినిమా ఇండస్ట్రీతో చిన్నపటి నుండి సంబంధాలు ఉన్నాయి. అయితే మొదట తండ్రికి ఆమని హీరోయిన్ అవడం ఇష్టం లేదట. కానీ చివరకు తనకు తాను కష్టపడి హీరోయిన్ గా అవకాశం తెచ్చుకోవడం, ఈవివిగారి సినిమాలో మంచి అవకాశం దొరికడంతో ఆయనా ఒప్పుకున్నారట. ఇక ఆయన మరణించాక పెద్ధ కూతురుగా ఇంటి బాధ్యత మొత్తం ఆమని గారు చూసుకున్నారు.

అలా తమ్ముడిని, తన తల్లి దత్తత తీసుకున్న ఇద్దరు ఆడపిల్లల్ని అందరినీ చదివించి సెటిల్ చేసారు. అయితే తమ్ముడి భార్య తరుపున వాళ్ళు తన మీద వేధింపుల ఆరోపణలతో కేసు వేయడం గురించి చెబుతూ ఆ కేసులో తనమీద వేసిన నింద నిజం కాదంటూ చెప్పారు. తన తమ్ముడు భార్య కూడా చాలా మంచి అమ్మాయి అని ఇందులో తన తప్పు కూడా లేదంటూ వివరించారు. ఆ అమ్మాయి తరుపున వాళ్లకు లాయర్ ఎవరైనా సెలబ్రిటీ కుటుంబంలో ఉన్నపుడు వారి మీద కేసు పెడితే స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పడంతో అలా నా పేరును కేసులో పెట్టరు. నా తమ్ముడికి అతని భార్యకి వచ్చిన చిన్న చిన్న గొడవలు అంతే ఇపుడు అవేవీ లేవు. అందరం హ్యాపీగా ఉన్నాం, తను నాతో చాలా చక్కగా ఉంటుంది అంటూ వివరించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago