Star Actors: ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన బాలకృష్ణ చిరంజీవి నాగార్జున వంటి స్టార్ హీరోలకు లక్షల సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలా స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన వీరు అందరూ ఒకే చోట కనిపించడం చాలా అరదు. ఇలా అందరిని ఒకే ఫ్రేమ్ లో చూడాలని వారి అభిమానులు ఎంతో ఆశ పడుతూ ఉంటారు. అయితే నిత్యం షూటింగ్ పనులతో బిజీగా ఉండే స్టార్ హీరోలు ఇలా అందరూ ఒకేసారి కలవడం చాలా అరుదు.
తాజాగా బాలకృష్ణ చిరంజీవి నాగార్జున కమలహాసన్ నలుగురు ఒకే ఫ్రేమ్ లో కనిపించిన రేర్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలకృష్ణ, రజినీ, శారద, జగ్గయ్య ప్రధాన పాత్రల్లో.. వై. నాగేశ్వర రావు దర్శకత్వంలో డి. రామా నాయుడు ‘రాము’ అనే విడుదల అయ్యింది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ‘రాము’ 100 డేస్ ఫంక్షన్‌కి చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ సమయంలో వీరు నలుగురు కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ నలుగురు హీరోలు అప్పటినుండి ఇప్పటివరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతూనే ఉన్నారు. కమల్ హాసన్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి తన దూకుడు కొనసాగిస్తున్నాడు. ఇటీవల విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఇక చిరంజీవి కూడా ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.
ఇక చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే ఇటీవల నాగార్జున దూకుడు కొంతవరకు తగ్గినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ మాత్రం వీరందరికన్నా యమ జోరుగా ఉన్నాడు . ఒకవైపు సినిమాలలో నటించడమే కాకుండా మరొకవైపు హోస్ట్ గా రియాలిటీ షోలలో సందడి చేస్తున్నాడు. తాజాగా వీరసింహారెడ్డి సినిమాతో బాలకృష్ణ కూడా మంచి హిట్ అందుకున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…