Anjali: వెండి తెరపై సీతగా ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అంజలి ఒకరు. ఈమె హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇకపోతే అంజలి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన గీతాంజలి అనే హర్రర్ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈమె ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో భాగంగా అంజలి తన పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే ఈమె ఇదివరకు తమిళ హీరోని ప్రేమించిందని అయితే తనని మోసం చేశారు అంటూ వార్తలు వచ్చాయి. అదే విధంగా ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది అంటూ కూడా ఈమె పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నటువంటి తరుణంలో అంజలి పెళ్లి వార్తలపై స్పందించారు.
ఎన్నిసార్లు నాకు పెళ్లి చేస్తారు..
ఈ సందర్భంగా అంజలి తన పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తన పెళ్లి గురించి తనకు తెలియకుండానే ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయని తెలిపారు. నేను పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యానంటూ కూడా వార్తలు రాశారు. నాకు తెలియకుండానే అందరూ నా పెళ్లిని చేసేస్తున్నారు. ఈ వార్తలను చూస్తుంటే నవ్వొస్తుంది అంటూ ఈమె పెళ్లి వార్తలను పూర్తిగా ఖండించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…