Chandu Sai: ఇటీవల కాలంలో సినిమా సెలబ్రిటీలు కంటే య్యూట్యబర్స్ కే ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటున్నారు. వారి ప్రతీ వీడియో లక్షల్లో.. కోట్లల్లో చూస్తుంటారు. ఇలా ఎక్కువమంది యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉంటారు కనుక వారికి అదే స్థాయిలో ఫాలోయింగ్ ఉందని చెప్పాలి ఇలా యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో చందు సాయి ఒకరు.
చందు సాయి షార్ట్ వీడియోస్.. రీల్స్. వెబ్ సీరిస్ లు, సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా వీడియోలు చేసి.. కాస్త మంచి కంటెంట్ ను జనాలకు అందించే వారిలో చందు ముందుంటాడు. అందుకే అతనికి చాలా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా కెరియర్ పరంగా ఈయన ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అన్న తరుణంలోనే ఒక అమ్మాయి విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఓ అమ్మాయిని మోసం చేశాడంటూ.. నిందలువేయడంతో పాటు..అతన్ని అరెస్ట్ చేశారు కూడా.. తన కుటుంబాన్నికూడా వదిలి పెట్టకుండా వారిపై కూడా కేసులు పెట్టడంతో ఒక్కసారిగా ఈయన జీవితం మొత్తం తలకిందులుగా మారిపోయింది ఇకపోతే తాజాగా ఈయన తన అరెస్టు గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఈయన అరెస్టు కావడంతో అసలు విషయం తెలియక పలువురు వారికి తోచినది మాట్లాడేశారు ఈ విషయం గురించి చందు సాయి మాట్లాడుతూ…
అరెస్టుపై స్పందించిన చందు సాయి..
తన అరెస్టు విషయంలో చాలామంది వివిధ రకాల కామెంట్లు చేశారు. నా ఫ్యామిలీని కూడా ఎంతో బాధ పెట్టారు అయితే నేను అమ్మాయి పట్ల చేసినటువంటి మోసం కనుక రుజువైతే నేనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు. నిజా నిజాలు తెలియకుండా నా గురించి నా ఫ్యామిలీ గురించి ఎన్నో తప్పుడు వార్తలు కూడా రాశారని చందు సాయి ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…