Heroine Ester Noronha : ‘వెయ్యి అపద్ధాలు’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎస్తేర్ ఆ తరువాత ‘భీమవరం బుల్లోడు’ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుని సినిమాలు చేస్తూనే రాపర్, సింగర్ నోయెల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే మొదట్లో బాగానే ఉన్నా వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. విడిపోయాక ఎస్తేర్ మళ్ళీ సినీమాల్లో బిజీగా ఉంది. ఇక తన సినిమా విశేషాలను గురించి వివరించారు.
విడిపోయాక చెప్పింది ఇదే…
సింగర్ మరియు రాపర్ అయిన నోయల్, హీరోయిన్ ఎస్తేర్ ను వివాహం చేసుకున్నారు. మొదట్లో బాగానే ఉన్నా వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. అయితే వీళ్ళు వీడిపోయిన తరువాత ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నా సోషల్ మీడియా మాత్రం వీళ్ళను వదలడం లేదు. వారు వీడిపోవడానికి కారణాలు, ఇక రెండో పెళ్లి గురించి రక రకాల ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ విడాకులు అలానే ఆ విషయానికి సంబంధించిన ప్రశ్నలే ఎస్తేర్ కి ఎదురయ్యాయి.
డివోర్స్ తీసుకున్నాక నోయెల్ కి చివరగా పెట్టిన మెసేజ్ ఏమిటి అనే ప్రశ్న ఎదురావగా ఎస్తేర్ అలా డ్రామటిక్ విషయాలేమి జరగలేదని విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాక తన ఇంటి నుండి వచ్చేటప్పుడే నీకు నచ్చిన అమ్మాయి నీ అభిప్రాయాలతో కలిసే అమ్మాయి నీ జీవితంలోకి రావాలి హ్యాపీగా ఉండాలి అని చెప్పి వచ్చేశానంటూ ఎస్తేర్ చెప్పారు. ప్రపంచంలో ఎవరైనా ప్రేమ పొందడానికి అర్హులే. అందులో తప్పేమీ లేదు తన స్వభావానికి సరిపోయే అమ్మాయి దొరికి తనకు ప్రేమ లభిస్తే మంచిదే కదా అంటూ ఇంటర్వ్యూలో తెలిపారు.
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…