బుల్లితెరపై సుడిగాలి సుదీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్న కార్యక్రమం “శ్రీదేవి డ్రామా కంపెనీ”.అన్ని రకాల ప్రేక్షకులకు వినోదం పంచుతూ ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ కార్యక్రమం తాజాగా 25వ ఎపిసోడ్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ వారం ప్రసారమయ్యే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా సీనియర్ హీరోయిన్లు ఇంద్రజ లైలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ క్రమంలోనే ఇంద్రజ స్టేజి మీద వానలో “మెరిసింది మేఘా మేఘా” అంటూ చిందులు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే ఇంద్రజకు తోడుగా లైలా కూడా కాలు కదిపారు. ఈ విధంగా స్టేజ్ పై ఇంద్రజ వేసిన స్టెప్పులు చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు.
ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ దాదాపు 18 సంవత్సరాల తర్వాత స్టేజ్ పై డాన్స్ వేశానని చెప్పడంతో సుడిగాలి సుదీర్ అందరూ చూస్తుండగానే…” 18 ఏళ్ల తర్వాత చేసినప్పటికీ, 18 ఏళ్ల పిల్లల డాన్స్ చేశారు” అని అనడంతో అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఇక ఈ ప్రోమోలో హైపర్ ఆది చేసిన రచ్చ మామూలుగా లేదు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…