సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోనే సెలబ్రిటీల జీవితం ఇతరుల జీవితం కన్నా ఎంతో భిన్నంగా ఉంటుంది. వారు ఒకరితో ప్రేమలోపడి.. డేటింగ్ చేసి పెళ్లి వరకు వెళ్లి బ్రేకప్ చెప్పుకునే సందర్భాలు ఎన్నో ఉంటాయి. అదే విధంగా మరికొన్ని జంటలు పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోతూ ఉంటారు. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు వారి జీవిత భాగస్వామితో విడాకులు తీసుకున్నారు. ముఖ్యంగా ఇలాంటి సంస్కృతి బాలీవుడ్ ఇండస్ట్రీలో అధికంగా ఉంది.
ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌తో డేటింగ్ చేసి అతన్నే పెళ్లాడింది. పెళ్లి తర్వాత ఈ జంట ఎంతో అన్యోన్యంగా రొమాంటిక్ పెయిర్ గా కొనసాగుతున్నారు. పెళ్లి తర్వాత అమెరికాలోని స్థిరపడిన ఈ జంట గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా రాబోయే 10 సంవత్సరాలలో తన భర్తతో విడాకులు తీసుకోబోతోందని జోస్యం చెప్పాడు సినీ విశ్లేషకుడు కమల్ ఆర్ ఖాన్. ”నిక్ జోనాస్‌కు 10 ఏళ్లలో ప్రియాంక విడాకులు ఇవ్వడం తథ్యం” అని పేర్కొంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మరో పది సంవత్సరాలలో నువ్వు కూడా చస్తావ్ అంటూ కౌంటర్ ఇస్తున్నారు.అదేవిధంగా మరికొందరు వారు విడిపోవాలని కోరుకునే హక్కు నీకు లేదంటూ కమల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కమల్ చేసిన ట్వీట్ బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…