Heroine Laya : ‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా తొలి అవకాశంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి లయ. తెలుగమ్మాయి అయినా కూడా తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకుని స్వయం వరం, ప్రేమించు అంటూ వరుస హిట్లందుకుంది. అలాగే నంది పురస్కారాలను కూడా అందుకుంది. తన నటనతో ఆందరినీ ఆకట్టుకున్న లయ కెరీర్ బాగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకుంటున్న లయ ఒకవైపు సోషల్ మీడియాతో అభిమానులకు టచ్ లో ఉంటూనే మరోవైపు సినిమాల్లో చేయాలని అనుకుంటున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ తన ఫ్యామిలీ గురించి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
భర్త, పిల్లలు ఏంచేస్తారంటే…
తానా సభలకు అమెరికా వెళ్లిన సమయంలో బంధువుల ఆమె ద్వారా వచ్చిన సంబంధంనే లయ పెళ్లి చేసుకున్నా పెళ్ళికి ముందే తన కాబోయే భర్తతో మాట్లాడుతూ ఆయన ఎలాంటి వారో తెలుసుకున్నారట. ఇక తన భర్త తనకు ఎపుడు సినిమాలను చేయొద్దని తన మీద ఎలాంటి ఆంక్షలు రుద్దలేదంటూ లయ తెలిపారు. లయకు 14 ఏళ్ల కూతురు, 12 ఏళ్ల కొడుకు ఉన్నారు.
కూతురు సినిమాల్లో నటిస్తే చూడాలని ఉందని, రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ లో ఒక పాత్ర చేసిందని అయితే సినిమాలో నటిస్తే తనకేమి అభ్యంతరం లేదని, కాకపోతే తనకు ఆసక్తి లేకపోతే మాత్రం వద్దనే అంటాను అంటూ చెప్పారు. ఇక తన భర్త రేడియాలజీ అంకాలజీ స్పెషలస్ట్ అని అమెరికాలో తాము ఉన్న ప్రాంతంలో ఫేమస్ డాక్టర్ అని తెలిపారు. సొంతంగా ఒక హాస్పిటల్ అలాగే మరో రెండు హాస్పిటల్స్ లో పార్టనర్షిప్ ఉందని లయ తన కుటుంబం గురించి వివరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…