Featured

Heroine Prema : షూట్ లో నిజంగానే పాము కరిచి నీలంగా శరీరం మారింది… హాస్పిటల్ కి వెళితే…: హీరోయిన్ ప్రేమ

Heroine Prema : ‘దేవి’ సినిమాతో చెరగని ముద్ర వేసుకున్న నటి ప్రేమ. ధర్మచక్రం సినిమాలో వెంకటేష్ సరసన నటించి క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినా తెలుగమ్మాయి అనే ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ కన్నడ కస్తూరి. తండ్రి టూరిజం డిపార్ట్మెంట్ లో డ్రైవర్ గా పనిచేస్తూ ఉండగా ప్రేమ గారికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆయన క్రికెటర్ అయ్యప్ప. ఇక ఆమె సినిమాల్లోకి వచ్చాక తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. రాయలసీమ రామన్న చౌదరి అలాగే ఢీ, చిరునవ్వుతో వంటి సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం తెలుగులో నటించడం లేదు. ఇక బెంగళూరు లో నివాసముంటున్న ఆమె తన ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితం గురించి వివరించారు.

నిజంగానే పాము కరిచింది…

దేవి సినిమా ప్రేమ సినిమా కెరీర్ లో ఒక మైలు రాయి వంటిది. అప్పటి వరకు చేసిన సినిమాలతో రాని గుర్తింపు దేవి సినిమాతో ప్రేమ కు వచ్చింది. ఆ సినిమాలో నాగ దేవతగా నటించగా ఆ సినిమా షూటింగ్ కి సంబంధించిన విశేషాలను ఆమె పంచుకున్నారు. వైజాగ్ లో ఒక ఇంట్లో షూటింగ్ చేస్తున్న సమయంలో నిజమైన పామును ఉపయోగిస్తున్న సమయంలో ఒక వ్యక్తిని పాము కరించిందని చెప్పారు ప్రేమ.

శరీరం అంతా నీలం రంగులోకి మారిపోయి హాస్పిటల్ తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పాయిందని అతను మరణించాడని వివరించారు. ఇక కులు మనాలి లో క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నపుడు అక్కడ చలికి తట్టుకోలేక రెండు పాములు చనిపోయాయని తెలిపుతూ ప్రేమ అప్పటి సినిమా విశేషాలను పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago