Heroine Shanthi Priya : హీరోయిన్ భాను ప్రియ చెల్లెలుగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన శాంతి హీరోయిన్ అయ్యాక తెలుగులో శాంతి ప్రియగా తమిళంలో నిశాంతి గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినా మొదటి సినిమా ‘మహర్షి’ వల్ల బాగా ఫేమస్ అయింది. మహర్షి సినిమాలోని పాత్రకు ఇప్పటికీ ఆమెకు అభిమానులు ఉండటం విశేషం. హిందీ నటుడిని పెళ్లి చేసుకుని ముంబై లో సెటిల్ అయిన శాంతి ప్రియ కు ఇద్దరు కొడుకులు. సినిమాలకు ఎపుడో గుడ్ బై చెప్పిన శాంతి, తాజాగా ధారావి బ్యాంకు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ముంబై లో తన ఇద్దరు కుమారులతో శాంతి జీవిస్తున్నారు.
భర్త చనిపోయాక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా…
శాంతి ప్రియ గారు మరాఠి, హిందీ నాటుడైన సిధార్థ రే ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సిద్దార్థ్ రే కి సుశాంత్ రే అనే మరో పేరు కూడా ఉంది. హిందీ లో వచ్చిన బాజీఘర్ వంటి సినిమాలతో ఆయన బాగా ఫేమస్. ఫిల్మ్ ఫేర్ అవార్డు ఫంక్షన్స్ లో కలిసినపుడు శాంతి గారికి సిద్ధార్థ్ గారికి పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ్ రే తాతగారు వి.శాంతారామ్ గారు అలాగే తండ్రి ప్రసిద్ధ ఆర్థిక వేత్త సుబ్రతో రే. సిద్ధార్థ రే శాంతి ప్రియ గారికి ఇద్దరు కుమారులు కాగా 2004 లో నలభై ఏళ్ల వయసులో సిద్ధార్థ్ కన్నుమూశారు.
ఇక శాంతి ప్రియ గారు భర్త మరణించాక జీవితం ఎలా మారిపోయింది తాను ఎలా అయిపోయననే విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అంతవరకు ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపిన శాంతి గారికి భర్త మరణంతో డిప్రెషన్ లోకి వెళ్లారట. ఇక పిల్లలను తానే పెంచి పెద్ధ చేయాలి అన్నపుడు తన తల్లే గుర్తుకు వచ్చిందని తన తల్లి కూడా ఒంటరిగా చెన్నై వచ్చి నన్ను, అక్కను, అన్నను పెంచి ఇక్కడదాకా తెచ్చినపుడు నేను నా పిల్లలను పెంచలేనా అనిపించింది. అయన లేకపోయినా పిల్లలకు ఏ లోటు లేకుండా పెంచాలని నిర్ణయించుకుని ముంబై లోనే ఉండి బ్రతకాలని అనుకున్నాను అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…