Narayana Murthy: వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన చిత్రం సార్.విద్యా వ్యవస్థ పై ఓ లెక్చరర్ చేస్తున్న పోరాట నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ద్వారా ధనుష్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని అతి తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.
ఇలా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన యాంకర్ స్రవంతి చొక్కారపు పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇలా స్రవంతి పై నారాయణమూర్తి సీరియస్ అవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
నారాయణమూర్తి వేదిక పైకి వచ్చి ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి మాట్లాడుతూ వచ్చారు. అయితే నారాయణమూర్తి కమెడియన్ హైపర్ ఆది గురించి మాట్లాడటం మర్చిపోయారు. దీంతో ఆయన మరోసారి మైక్ తీసుకుని కమెడియన్ హైపర్ ఆది గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇది గమనించని స్రవంతి వేదిక పైకి మరొకరిని ఆహ్వానించారు. దీంతో నారాయణమూర్తి ఉన్నఫలంగా స్రవంతి పై సీరియస్ అయ్యారు.
దీంతో నారాయణమూర్తి ఏ పిల్ల ఆపు.. ఏ అమ్మాయ్ టైరో టైరో స్టేజ్ మీద ఎవరు మాట్లాడుతున్న కాసేపు ఆగండి.మాట్లాడిన తర్వాత పిలవండి కాస్త సభ్యతతో మెలగండి అంటూ ఈయన స్రవంతి చొక్కారపుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దీంతో ఇందుకు సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో ఫైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…