తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం పాటు తన హవాని కొనసాగించిన ఎంతోమంది స్టార్ నటీమణులలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకొని ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు నటి శ్రియ.కెరియర్ మొదట్లో మోడలింగ్ చేసినటువంటి శ్రియ “ఇష్టం” సినిమా ద్వారా వెండితెరపై సందడి చేశారు.ఈ క్రమంలోనే నాగార్జున సరసన నటించినటువంటి “సంతోషం” సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.
ఈ విధంగా కెరియర్ పై ఎంతో ఫోకస్ పెట్టిన శ్రీయ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించింది. ఈ క్రమంలోనే విదేశీ వ్యాపారవేత్తతో ప్రేమ ప్రయాణం సాగించిన ఈమె 2018 లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. ప్రస్తుతం వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న శ్రీయ వివాహం తర్వాత సోషల్ మీడియాలో ఎంతో బిజీగా ఉన్నారు.
నిత్యం తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి దిగినటువంటి రొమాంటిక్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానుల సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఏకంగా బికినీ ధరించి అందాలను ఒలకబోస్తూ ఉన్న ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.
ఈ క్రమంలోనే తాజాగా శ్రీయ శరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిక్ ప్లేస్‌లో తీసుకున్నటువంటి వీడియోను ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో శ్రీయ తన భర్త ఆండ్రీతో కలిసి పబ్లిక్ గా ఎంతో రొమాన్స్ చేశారు. ఈ వీడియోలో శ్రేయ పాట పాడుతూ ఉండగా తన భర్త స్టెప్పులు వేశాడు. ఇందులో భాగంగానే పాట పాడుతున్న శ్రీయ ఉమ్మా ఉమ్మా అంటూ తన భర్తను రెచ్చగొట్టడంతో అతను ఏకంగా లిప్ టు లిప్ కిస్ ఇచ్చాడు.ప్రస్తుతం ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “RRR” సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…