Featured

మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం తృటిలో తప్పిపోయిన హీరోయిన్స్ వీరే..!!

1980 దశకంలో తెలుగుతెర పై ఇదివరకు ఎరగని డాన్సులు, ఫైట్స్ అవలీలగా చేసే సుప్రీం హీరో చిరంజీవి. హిట్టు, సూపర్ హిట్టు, ఇండస్ట్రీ హిట్టు సినిమాలకి మారుపేరుగా ఆయన మారిపోయాడు. అలాంటి స్టార్ హీరోతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ప్రతి హీరోయిన్ నటించాలి అనుకోవడం అత్యంత సహజం.

అలా అప్పటి సమకాలీన హీరోలందరితో నటించిన రజిని చిరంజీవి తో నటించే అవకాశం తృటిలో తప్పిపోయింది. బాలకృష్ణతో సీతారామ కళ్యాణం, ప్రాణానికి ప్రాణం, రాము చిత్రాల్లో నటించింది. ఇక వెంకటేష్ తో ధ్రువ నక్షత్రం, బ్రహ్మరుద్రులు ఆయనకు జోడీగా చిందులు వేసింది. నాగార్జునతో మజ్ను, మురళీ కృష్ణుడు, కలెక్టర్ గారి అబ్బాయి.

ఇక రాజేంద్రప్రసాద్ తో రెండు రెళ్ళ ఆరు, అహ నా పెళ్ళంట లాంటి అనేక చిత్రాల్లో ఆమె నటించింది. అడపాదడపా చిరంజీవితో అవకాశాలు వచ్చినప్పటికీ మధ్యవర్తులు అవకాశం తన వరకు రాకుండా చేశారని ఆమె వాపోయారు.

హీరోయిన్ అశ్విని… చంద్రమోహన్, బాలకృష్ణ, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్, మోహన్ బాబులతో కలిసి నటించింది. అయితే ఒకసారి బాలకృష్ణతో “భానుమతి గారి మొగుడు” చిత్రంలో నటిస్తున్నప్పుడు చిరంజీవితో కలిసి నటించే అవకాశం వచ్చినా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో చిరంజీవితో చేసే అవకాశం అశ్విని చేజారిపోయింది.

1990 ప్రథమార్థంలో సినీ పరిశ్రమకు ప్రవేశించిన ఆమని కృష్ణ, బాలకృష్ణ, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్ వంటి హీరోలతో నటించినప్పటికీ చిరంజీవితో నటించే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన “రిక్షావోడు” చిత్రంలో సౌందర్యతో పాటుగా మరో హీరోయిన్ గా ఆమని అనుకున్నప్పటికీ నిర్మాతలు ఈ విషయాన్ని తెలపకుండా ఆమని తొలగించి నగ్మాను పెట్టుకున్నారు.

1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో యమలీల చిత్రంలో అలీ, ఇంద్రజ హీరో, హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత ఇంద్రజ.. రాజేంద్ర ప్రసాద్, నాగార్జున, బాలకృష్ణతో “పెద్దన్నయ్య” చిత్రంలో నటిస్తున్నప్పుడు చిరంజీవి తో చేసే అవకాశం వచ్చినప్పటికీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఇంద్రజ చిరంజీవితో చేసే అవకాశాన్ని కోల్పోయింది.

శుభాకాంక్షలు సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన రాశి.. శ్రీకాంత్ జగపతిబాబు, మోహన్ బాబు, రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్, బాలకృష్ణ వంటి హీరోలతో కలిసి నటించారు. “మనసంతా నువ్వే” చిత్రం విజయం తర్వాత వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో చిరంజీవి, రాశి హీరో, హీరోయిన్లుగా సినిమా అనౌన్స్మెంట్ జరిగి మధ్యలోనే సినిమా ఆగిపోవడం గమనార్హం. చిరంజీవితో అవకాశం తప్పిపోయినప్పటికి రాశి, పవన్ కళ్యాణ్ తో “సుస్వాగతం” సినిమా చేసే అవకాశాన్ని పొందింది.

ఈ విధంగా అనేక మంది హీరోయిన్స్ చిరంజీవితో అవకాశం వచ్చినట్టే వచ్చి తృటిలో తప్పి పోవడం వారి దురదృష్టంగా భావించడం జరిగింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago