Movie News

HHVM Success Meet : ‘బాయ్‌కాట్ బెదిరింపులకు భయపడను..’ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన ‘హరిహర వీరమల్లు’ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా పవన్ కల్యాణ్ ఓపెన్‌గా స్పందించారు. కొంతమంది ఈ సినిమాను బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించారని, కానీ తనకు అలాంటి బెదిరింపుల వల్ల ఏమీ పోయేది లేదని స్పష్టంగా తెలిపారు. “ఇది ఏమైనా క్విట్ ఇండియా ఉద్యమమా? ఏం చేస్తారో చేసుకోండి” అంటూ తాను స్పందించానని చెప్పారు.

“బాయ్‌కాట్ చేస్తామంటే నేను ఎదిగాననే అర్థం”

నెల్లూరులోని ఓ చిన్న వీధిలో పెరిగిన తాను ఇంతటి స్థాయికి రావడం అంటే ఎంతో గొప్ప విషయమని భావిస్తున్నట్టు వెల్లడించారు. “నన్ను బాయ్‌కాట్ చేస్తామంటే, వాళ్లే చెబుతున్నారు నేను ఎంతస్థాయికి ఎదిగానో,” అంటూ చురకలంటించారు పవన్.

తాను జీవితంలో ఎన్నో దెబ్బలు చూసానని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తి కాదన్నారు. అభిమానుల ప్రేమే తన బలం అని, వారిచ్చే ధైర్యమే తనను ఇంతదూరం తీసుకువచ్చిందని తెలిపారు. “డిప్రెషన్ ఎంటో నాకు తెలీదు. మనం బలంగా ఉన్నప్పుడు కొందరు నెగిటివ్‌గా మాట్లాడతారు. అది సహజం” అని పేర్కొన్నారు.

సినిమా విజయం, ప్రమోషన్లపై స్పష్టత

ప్రెస్ మీట్‌లో పవన్ సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సాధారణంగా సినిమా ప్రమోషన్లలో పాల్గొనని తాను, ఈ సినిమా విషయంలో ఎందుకు ప్రమోషన్ చేశానో అందరికీ అర్థమయ్యేలా వివరించారు.

‘హరిహర వీరమల్లు’ ప్రీమియర్ షోల నుంచే మంచి వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు దాదాపు రూ.50 కోట్ల షేర్ వచ్చినట్లు అంచనా. పాజిటివ్ టాక్ కొనసాగుతుండటంతో, ఈ విజయం నేపథ్యంలో చిత్రబృందం ఈ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago