Hollywood Celebrities praises RRR : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రాలలో వచ్చిన పాన్ ఇండియా మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఈ ఏడాది 1000 కోట్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. సినిమా విడుదల అయ్యి 3 నెలలు గడుస్తున్నా సినిమా క్రేజ్ ఇంకా తగ్గట్లేదు. దేశ విదేశాల్లో దుమ్మురేపుతూ ప్రస్తుతం హాలీవుడ్ లో దర్శకనిర్మాతాలను ఆక్కట్టుకుంటోంది.
ఆర్ఆర్ఆర్ సినిమా ఒక అద్భుతం…
ప్రస్తుతం హాలీవుడ్ లో ప్రముఖులు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు థియేటర్ లో చూస్తుంటే మరికొందరు నెట్ ఫ్లిక్స్ లో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా చూసిన చాలామంది హాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ స్పందన తెలిజెస్తున్నారు. ఈ కోవలోనే మార్వెల్ చిత్రకారుడు అలిస్ ఎక్స్ జాంగ్, టీవీ మరియు సినీ రచయిత అమీ పాలెట్ హార్ట్‌మన్ ఆర్ఆర్ఆర్ గురించి స్పందించారు.
ఇక తాజాగా ఈ కోవలోకి మరో హాలీవుడ్ ప్రముఖుడు చేరాడు. హాలీవుడ్ 21 జంప్ స్ట్రీట్, ది లెగో, స్పైడర్ మ్యాన్ చిత్రాల దర్శకుడు, నిర్మాత క్రిస్టోఫర్ మిల్లర్ ఆర్ఆర్ఆర్ సినిమాను చూసి తన స్పందనను ట్వీట్ చేశారు. “ఆర్ఆర్ఆర్ ఒక అద్భతం. ఇది మైఖేల్ బే, బాజ్ లుహ్రమాన్ మరియు స్టీఫెన్ చౌ కలిసి సినిమా తీయడం లాంటిది. ఇది 3 గంటల నిడివి ఉంది. కానీ.. 4 గంటలు ఉన్నా చూడొచ్చు. ఈ సినిమా చూస్తూ నేను ఎంతో ఎంజాయ్ చేశాను” అంటూ ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ ట్వీట్ పై ఆనందం వ్యక్తం చేసిన చిత్రనిర్మాణ సంస్థ ట్విట్టర్ లో దీనిని రీట్వీట్ చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…