Honey Rose: హనీ రోజ్ ఇదివరకే పలు తెలుగు సినిమాలలో నటించి సందడి చేశారు. ఈమె గతంలో ఆలయం ఈ వర్షం సాక్షిగా వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలో తనకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదని చెప్పాలి. తెలుగులో ఇలా తనకు మంచి గుర్తింపు లభించకపోవడంతో మలయాళంలోనే సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు.
తాజాగా ఈమె గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈమె బాలకృష్ణకు భార్య పాత్రలో నటించారు. ఇలా వీర సింహారెడ్డి సినిమా ద్వారా హనీ రోజ్ నటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు అందడమే కాకుండా ఈమెకు తెలుగులో మంచి గుర్తింపు కూడా లభించింది. ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హనీ రోజ్ వరుస అవకాశాలను అందుకుంటున్నారు.
ఈ సినిమా ద్వారా తెలుగులో కూడా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు ప్రమోషన్ కార్యక్రమాలతో ఎంతో బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే పలు రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాలలో కూడా బిజీగా మారిపోయారు.
ఇలా పలు షాపింగ్ మాల్స్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె గురించి ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా షాపింగ్ మాల్స్ లేదా రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి వెళ్లిన,ఏదైనా బ్రాండ్ ప్రమోట్ చేయాలన్న ఈమె భారీగానే డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇలా ఒక్కొక్క ప్రమోషన్ కోసం హనీ రోజ్ ఏకంగా ఎనిమిది నుంచి పది లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…