Honey Rose: మలయాళీ ముద్దుగుమ్మ హానీ రోజ్ తెలుగులో ఆలయం, ఈ వర్షం సాక్షిగా అనే సినిమాలలో నటించారు.ఇలా పలు తెలుగు సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు కానీ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్యకు భార్య పాత్రలో ఈమె నటించారు.
ఇలా వీర సింహారెడ్డి సినిమా ఈమెకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిందని చెప్పాలి. ఈ సినిమాలో ఈమె నటనకు ప్రేక్షకులకు ఫిదా కావడంతో ఈమెకు తెలుగులో పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి. ఇకపోతే తాజాగా విజయవాడలో ఒక బేకరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నటి హనీ రోజ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పెళ్లి గురించి నటన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండడంతో తాను ఇండస్ట్రీలోకి వచ్చానని తెలియజేశారు. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ పెళ్లి అనేది ఒక పెద్ద బాధ్యత అని ఈమె తెలియజేశారు. ఇక ఆ బాధ్యతను తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
వివాహ బంధం బలంగా ఉండడం కోసం తాను ఏం చేయడానికి అయినా సిద్ధమేనని హాని రోజ్ పెళ్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఈమె చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే ఈమె పెళ్ళికి సిద్ధమైందని తెలుస్తోంది. కానీ తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలి ఏం చేస్తుండాలి అనే విషయాలను గురించి మాత్రం వెల్లడించలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…