Categories: FeaturedMovie News

మంజు భార్గవి శంకరాభరణం హీరోయిన్ అవడానికి వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా?

సుప్రసిద్ధ నాట్యకారిణి అయినటువంటి మంజుభార్గవి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండేవి. అసలు ఆమె ఏ రోజు కూడా సినిమాల్లో హీరోయిన్ గా చేయాలని ప్రయత్నాలు కూడా చేయలేదు. అయినప్పటికీ ఈమెకు ఎప్పుడు కలలో కూడా ఊహించనటువంటి అద్భుతమైన అవకాశం వచ్చింది. అదే ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన “శంకరాభరణం” సినిమాలో హీరోయిన్ గా తులసి పాత్రలో అద్భుతంగా నటించారు.

ఈ సినిమాలో తులసి పాత్రలో నటించిన మంజుభార్గవికి ఈ సినిమా ఒక మైలురాయి అని చెప్పవచ్చు.అయితే అప్పటి వరకూ చిన్న చిన్న పాత్రలో నటిస్తున్న మంజుభార్గవిని ఇంత పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవడం వెనుక ఓ పెద్ద కథే ఉంది. చెన్నైలో ఒకసారి
ప్రొడ్యూసర్స్ గిల్డ్ వారు ఏదో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులంతా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులకు పన్నీరు చల్లటానికి గీత, మంజు భార్గవి, మరో నటిని ముగ్గురిని తలుపు దగ్గర నిలబడి వచ్చే అతిథులపై పన్నీరు చల్లుతున్నారు. ఆ కార్యక్రమానికి వచ్చిన అతిథులలో కె.విశ్వనాథ్ గారు ఉన్నారు.అయితే అప్పటికే శంకరాభరణం పనులు మొదలు పెట్టిన విశ్వనాథ్ గారు మంజు భార్గవిని చూడగానే తన సినిమాకి హీరోయిన్ దొరికిందని భావించారు. అయితే ఆమె నటన ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం శంకరాభరణం కంటే ముందుగా తీసిన చిత్రం “ప్రెసిడెంట్ పేరమ్మ” చిత్రంలో ఓ పాత్ర ఇచ్చారు.

ఈ సినిమాలో స్టేజ్ పై మేకప్ వేసుకుని నటించడమే కాకుండా ఈ సినిమాకు మంచి భార్గవి చేత డబ్బింగ్ చెప్పించారు.ఈ క్రమంలోనే ఫోటో ఒకటి కావాలని విశ్వనాథ్ గారు చెప్పగా ఆమె ఫోటో ఇచ్చి ఆసంగతి గురించి మర్చిపోయారు. ఒక నెల తరువాత శంకరాభరణం చిత్రం యూనిట్ నుంచి ఎవరో వచ్చి ఫోటో కావాలని అడగగా ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలు తీసి పంపించగా ఆ తర్వాత జె.వి సోమయాజులు, మంజుభార్గవికి మేకప్ వేసి ఫోటోలు తీశారు.

ఈ విధంగా తీసిన ఫోటోలను ఇండస్ట్రీలో పలువురి కె విశ్వనాథ్ గారు చూపించారు. అసలు ఆమె మంజు భార్గవి అని ఎవరూ గుర్తించలేకపోయారు. ఈ విధంగా మంజుభార్గవికి శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం రావడం ఆ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడంతో మంచి భార్గవి ఎంతో పాపులర్ అయ్యారు. అయితే ఆమెకు డాన్స్ పై ఉన్న మక్కువతో సినిమాలలో కంటే డాన్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టడం చేత సినిమాలలో తక్కువగా నటించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago